ద్వారకా తిరుమల ఆలయానికి రైస్ మిల్లర్స్ అసోషియేన్ భారీ విరాళం..
Send us your feedback to audioarticles@vaarta.com
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శేషాద్రి కొండపై కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం స్వామివారికి ఆలయంలో బంగారు వాకిరిని నిర్మిస్తున్నారు. దీని కోసం నేడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోటి రూపాయల విలువైన బంగారాన్ని విరాళంగా ఇచ్చింది. దీంతో స్వామి వారి ఆలయ వాకిలిని, తలుపులను బంగారం మయం చేస్తున్నారు. ఈ బంగారు వాకిలితో స్వామి వారి ఆలయం మరింత శోభాయమానంగా తయారవుతోంది.
ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ద్వారకా తిరుమల చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుంచి వెలికి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి ద్వారక తిరుమల అని పేరు వచ్చింది. సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. స్వామివారు దక్షిణాభిముఖుడై ఉంటాడు. మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తిరుమలలో మొక్కిన మొక్కులను చిన్న తిరుపతిలో తీర్చుకున్నా అదే ఫలం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయం అంత ప్రసిద్ధి చెందింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout