డ్రగ్ డీలర్‌తో రియా చాటింగ్ గుట్టు రట్టు..
- IndiaGlitz, [Wednesday,August 26 2020]
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసు మొత్తం ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి చుట్టే తిరుగుతోంది. రియాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై చాలా క్లియర్‌గా సీబీఐ దృష్టి సారించింది. ప్రస్తుతం రియా వాట్సాప్ చాట్‌ను సీబీఐ పరిశీలిస్తోంది. రియా చక్రవర్తి డ్రగ్ డీలరుతో జరిపిన వాట్సాప్ చాటింగ్ తాజాగా వెలుగు చూసింది. సుశాంత్ కేసులో మాదకద్రవ్యాల మాఫియా ప్రమేయాన్ని ఈ వాట్సాప్ చాట్ బహిర్గతం చేసింది. మాదకద్రవ్యాల వ్యాపారి గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ చాటింగ్ చేసిందని స్పష్టమైంది.
రియా చాట్ మొత్తాన్ని డిలీట్ చేసినప్పటికీ దానిని తిరిగి సంపాదించిన సీబీఐ.. ఈ కేసులో క తిరిగి దానిని సంపాదించింది. 2017 మార్చి 8వతేదీన డ్రగ్ డీలర్ గౌరవ్‌కు ‘మనం హార్డ్ డ్రగ్ గురించి మాట్లాడాలి, నేను దీన్ని వాడలేదు’ అని రియా చాట్ చేసింది. రెండోసారి గౌరవ్‌తో ‘మీ వద్ద ఎండీ ఉందా?’ అని ప్రశ్నించింది. ఎండీ అంటే మిథిలీన్ డయాక్సీ మెథాంపేటమిన్. ఇది ఒక బలమైన మాదకద్రవ్యం దీని గురించి రియా గౌరవ్‌తో చర్చించింది. మరోసారి రియాతో శామ్యూల్ మిరాండా చాటింగ్ చేశాడు. ‘హాయ్ రియా ఇష్యూ దాదాపుగా ముగిసింది’ అని పేర్కొన్నాడు.
అదే రియా, శామ్యూల్‌ల మధ్య 2020 ఏప్రిల్ 17వతేదీన జరిగిన చాటింగ్‌లో ‘మేం షోవిక్ స్నేహితుడి నుంచి మాదకద్రవ్యాలు తీసుకోవచ్చా’అని చాటింగ్‌లో రియా ప్రశ్నించింది. సుశాంత్ కేసులో రియా వాట్సాప్ చాటింగ్ వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఈ క్రమంలోనే రియాతో పాటు ఆమె కుటుంబసభ్యుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే దీనిని విశ్లేషించేందుకు ఈ కేసులో ఈడీతో సీబీఐ కలిసి పని చేయనుందని సమాచారం. ఈ క్రమంలో మొత్తానికి సుశాంత్ మృతి కేసులో మాదక ద్రవ్యాల మాఫియా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.