రియా డ్రగ్స్ కేసులో మరో సంచలనం.. రకుల్ సహా మరికొందరి పేర్లు..!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పలు అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్లో డ్రగ్స్ విపరీతంగా వినియోగిస్తున్నారనే విషయం సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని విచారించిన ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులకు సంచలన విషయాలను వారిద్దరూ వెల్లడించారు. సుశాంత్‌కి డ్రగ్స్ ఇచ్చినట్టు వెల్లడించిన రియా.. బాలీవుడ్లో 25 మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటుందని చెప్పి మరో సంచలనానికి తెరదీసింది.
అయితే ఆ 25 మంది ఎవరనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఈ డ్రగ్స్ కేసులో ఆ 25 మందిలో కొందరి పేర్లను వెల్లడించి సంచలనానికి తెరదీసింది. అయితే వారిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉండటం గమనార్హం. మాదకద్రవ్యాలు తీసుకునే పలువురు బాలీవుడ్ ఏ-లిస్టర్ల పేర్లను ఎన్సీబీకి వెల్లడించింది. వారిలో.. తెలుగులో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, హీరో రణ్వీర్ సింగ్ సన్నిహితురాలు సైమోన్ ఖంబట్టా తదితరుల పేర్లు ఉన్నట్లు ఓ ఆంగ్లపత్రిక సంచలన వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఈ కేసులో మరెందరి పేర్లు బయటకు రానున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
కాగా.. డ్రగ్స్ కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న రియాకు షాక్ తగిలింది. బెయిల్ కోసం ముంబై ప్రత్యేక కోర్టులో వీరివురూ పిటషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్లను ముంబై కోర్టు తిరస్కరించింది. అలాగే రియా, షోవిక్‌లతో పాటు ఇప్పటికే ఎన్సీబీ అదుపులో ఉన్న అబ్దుల్ బాసిత్, జైద్ విలత్రా, సావంత్, శామ్యూల్ మిరండా బెయిల్ పిటిషన్లను కూడా ముంబై కోర్టు తిరస్కరించింది. కాగా.. రియాకు డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ 22 వరకూ కోర్టు ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆమెను బైకుల్లా జైలులో ఉంచనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com