నా కాన్ సన్ ట్రేషన్ అంతా తెలుగులోనే - రియా చక్రవర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ లో టాలెంట్ నిరూపించుకొని బాలీవుడ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ… రియా చక్రవర్తి మాత్రం బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకొని తెలుగు చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ లాంటి బిగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం హానర్ గా ఫీల్ అవుతున్నానంటోంది. త్వరలోనే ఓ భారీ చిత్రంలో నటించబోతున్న ఈ చిన్నది చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే….
మా అమ్మగారు మంగళూరు, నాన్నదేమో బెంగాల్. నాన్న ఆర్మీ ఆఫీసర్. నేను పూణేలో పుట్టి పెరిగాను. తెలుగులో తూనీగ తూనీగ సినిమా చేసిన తర్వాత `మేరీ డాడ్ కి మారుతి`, సోనాలి కేబుల్ సినిమాల్లో నటించాను. అలా వరుసగా బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. `హాప్ గర్ల్ ఫ్రెండ్`, `బ్యాంక్ చోర్` సినిమాల్లో నటించాను. ఆ రెండు సినిమాలు నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ రెండు సినిమాల్లో నా పాత్రకు పెర్ ఫార్మెన్స్ పరంగా మంచి పేరు వచ్చింది. రివ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి.బ్యాంక్చోర్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్ర చేశాను. సినిమాలో కామెడి ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుతం నేను థియేటర్ గ్రూప్ లో యాక్టింగ్ నేర్చుకున్నాను. బెల్లీ డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఫిట్ నెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను.
చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ… నా పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోయినా… కథలో కొత్తదనం లేకపోయినా ఒప్పుకోలేదు. నాకు తెలుగులో మంచి పాత్రల్లో కనిపించాలని ఉంది. విద్యాబాలన్, అనుష్క నాకు బాగా నచ్చే హీరోయిన్స్. తెలుగులో రానా, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ అంటే ఇష్టం. నేను కథలు కూడా రాస్తాను. డైరెక్షన్ చేయలేను. కానీ నాకు అనిపించిన స్టోరీస్ రాస్తుంటాను. తెలుగులో ఓ మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాను. క్వాన్ నాకు ఆ అవకాశం ఇప్పించింది. యంగ్ హీరోస్ లో మంచి పేరున్న హీరోతో చేయడం నా అదృష్టం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ చెబుతాను. ప్రస్తుతం నా కాన్ సన్ ట్రేషన్ అంతా తెలుగు వైపే ఉంది. దీనికోసం తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com