మీడియాపై రియా చక్రవర్తి ఫైర్.. కొద్ది నిమిషాలకే పోస్ట్ డిలీట్..
Send us your feedback to audioarticles@vaarta.com
మీడియాపై బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. సుశాంత్ మృతి కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీబీఐ దర్యాప్తు కూడా ఆమె చుట్టూనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి దృష్టి రియాపైనే ఉంది. కాగా తాజాగా ఆమె మీడియాపై పలు ఆరోపణలు గుప్పించింది. మీడియాకు చెందిన కొందరు తన బిల్డింగ్ వాచ్‌మెన్‌ను కొట్టారని ఆరోపించింది. తన తండ్రిని సైతం బాధించారని వెల్లడించింది. ఏంటీ అనాగరిక చర్య అంటూ రియా ఇన్స్టాగ్రాం వేదికగా మండిపడింది.
‘‘రామ్ గత 10 సంవత్సరాలుగా నా భవనాలకు వాచ్‌మెన్‌గా ఉంటున్నాడు. మీడియా అతడిని తీవ్రంగా గాయపరిచింది. మీడియాకు సంబంధించిన పలువురు వ్యక్తులు నా బిల్డింగ్ కాంపౌండ్‌లోకి ప్రవేశించి సెక్యూరిటీ గార్డులను, నాన్నను గాయపరిచారు. ఇది క్రైమ్ కాదా? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఏదైనా చట్టం ఉందా? మేమేమైనా అనాగరికులమా? సంబంధిత అధికారులు దీనిని పరిశీలించాలి. ఈ భవనంలో పిల్లలు, పెద్దలు కూడా నివసిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థలోనా మనం జీవిస్తోంది?’’ అంటూ మండిపడింది. రామ్ మాటలను ఓ వీడియో తీసి ఆ వీడియోను కూడా రియా పోస్ట్ చేసింది.
‘‘నా పేరు రామ్.. నేను ఇక్కడ సెక్యూరిటీగా పదేళ్ల నుంచి పని చేస్తున్నా. ఇవాళ ఇక్కడకు మీడియా వాళ్లు వచ్చారు. నాతో దారుణంగా ప్రవర్తించారు. నన్ను కొట్టారు. నాకు చిన్న పిల్లలున్నారు. వీళ్ల కారణంగా నేను ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నా. మమ్మల్ని పైకి ఎందుకు వెళ్లనివ్వడం లేదని నన్ను కొడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు’’ అని రియా సెక్యూరిటీ గార్డు రామ్ తెలిపాడు. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే రియా దీనిని డిలీట్ చేయడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com