సుశాంత్ ప్రియురాలు.. రియా చక్రవర్తి అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అరెస్ట్ చేసింది. ఇటీవల డ్రగ్ మాఫియాతో ఆమె జరిపిన వాట్సాప్ చాట్ బహిర్గతమైన విషయం తెలిసిందే. అలాగే విచారణలో కూడా సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు రియా స్వయంగా అంగీకరించింది. దీంతో రియాకు డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్టు ఎన్‌సీబీ గుర్తించి.. ఆమెను మంగళవారం ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది.
కాగా.. రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని సైతం ఎన్‌సీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎన్‌సీబీ మూడు రోజులపాటు రియాను విచారించింది. మూడో రోజు విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే మూడో రోజు విచారణలో భాగంగా రియా తాను గంజాయి మాత్రమే కాకుండా ఇతర కెమికల్స్ కూడా వాడినట్టు అంగీకరించిందని సమాచారం.
డ్రగ్స్ మాఫియాతో రియా ఛాటింగ్ బహిర్గతమవడంతో ఎన్‌సీబీ రంగంలోకి దిగింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ను సైతం విచారించింది. అయితే ఈ విచారణలో రియా అంతా సుశాంత్ కోసమే చేశానని అని ఎన్‌సీబీ అధికారులకు తెలిపినట్టు సమాచారం. సుశాంత్ నటించిన ఓ సినిమా సెట్‌లో డ్రగ్స్ వినియోగించారని రియా చెప్పడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు సైతం సమన్లు పంపాలని ఎన్‌సీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com