Vyooham, Sapatham: 'వ్యూహం', 'శపథం' సినిమాలు విడుదల ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం', 'శపథం' సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం, ఏపీ సీఎం జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? అనే అంశాలతో ఆర్జీవీ ఈ సినిమాలను తెరకెక్కించారు. అయితే చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా తెరకెక్కించారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తెలంగాణ హైకోర్డును ఆశ్రయించారు.
దీనిపై విచారించిన న్యాయస్థానం సినిమా విడుదలకు బ్రేక్ వేసింది. అయితే మరోసారి సెన్సార్ చేయాలని ఆదేశించింది. దీంతో సినిమాలోని అభ్యంతకర సన్నివేశాలు, డైలాగ్స్ తొలగిస్తూ కొత్తగా సెన్సార్ సర్టిఫికేట్ జారీచేశారు. దీంతో మూవీ విడుదల తేదీలను తాజాగా ప్రకటించారు. ఇందులో భాగంగా తొలుత ‘వ్యూహం’ మూవీని ఫిబ్రవరి 23న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇది విడుదలైన వారం రోజులకు ‘శపథం’ మూవీని మార్చి 1న రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ ఈ రెండు చిత్రాలను నిర్మించారు.
ఇక ఇందులో సీఎం జగన్ పాత్రలో ‘అజ్మల్ అమీర్’, వైఎస్ భారతి రోల్‌లో మానస రాధా కృషన్ నటించారు. ఈ సినిమాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి పాత్రలతో పాటు మరికొంతమంది రాజకీయ నాయకుల పాత్రలు కూడా కనిపించబోతున్నాయి. కాగా ఇటీవల విడుదలైన ‘యాత్ర 2’ హిట్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా రన్ అవుతోంది.
కాగా ఆర్జీవీ గతంలో తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలు ఘోర పరాజయం చవిచూశాయి. సినిమాలో కంటెంట్ కంటే ఇతర పార్టీల నేతలను కించపరుస్తూ తీసిన సన్నివేశాలే ఉన్నాయని ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ విమర్శలు చేశారు. మరి ఇప్పుడు తీసిన ఈ రెండు సినిమాలు కూడా జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments