వర్మ చేతికి చిక్కిన ఎన్‌టీఆర్, అఖిల్‌ల ఫన్నీ వీడియో..
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తరచూ రాజకీయ, సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన కళ్లలో ఎవరు పడినా వారికి మూడిందనే అనుకోవాలి. సోషల్ మీడియా వేదికగా సెటైర్లతో రెచ్చిపోతుంటారు. రాజకీయ, సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోటో లేదంటే వీడియో కాస్త రొటీన్‌కు భిన్నంగా కనిపించందంటే చాలు.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలతో ఓ ఆటాడుకుంటారు. అలాంటి ఆర్జీవీకి ఇసారి హీరో యంగ్‌టైగర్ ఎన్టీఆర్, అఖిల్ అక్కినేని చిక్కారు. వీరివురికి సంబంధించిన ఓ వీడియో ఆయన కంటికి చిక్కింది.
అయితే ఆ వీడియో లేటెస్ట్‌దైతే ఏమీ కాదులెండి.. గతంలో ఓ మూవీ ఈవెంట్‌లో జూనియర్ ఎన్టీఆర్.. అఖిల్‌ను సరదాగా ఆటపట్టిస్తున్న వీడియో అది. ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆర్జీవీ ఓ సెటైర్ వేశారు. ఈ వీడియో రాంగోపాల్ వర్మకి ఎక్కడ దొరికిందోగాని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ 'ఇక హీరోయిన్స్ పరిస్థితేంటి..ఐయాం ఫీలింగ్ సో సాడ్ ఫర్ హీరోయిన్స్'.. అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ టీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలో ఏం ఉందంటే.. యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, అఖిల్ అక్కినేని కలిసి ఒక ఈవెంట్‌లో పక్కపక్కనే కూర్చొని సరదాగా ముచ్చటించుకుంటున్నారు. ఈ సమయంలో తారక్.. అఖిల్‌ని ఆట పట్టుస్తూ తన చేతితో అఖిల్ థైస్ మీద గిల్లాడు. దీనికి అఖిల్ ఇచ్చిన రియాక్షన్ ఓ కెమెరా కంటికి చిక్కింది.
Am feeling so sad for heroines???????????? pic.twitter.com/cK64qdQi4n
— Ram Gopal Varma (@RGVzoomin) April 8, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com