అఖిల్ తో ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ కథానాయకుడు అక్కినేని నాగార్జునకి ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో.. శివ` చిత్రం రూపంలో ఓ ట్రెండ్ సెట్టర్ సినిమాని అందించారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు నాగార్జున రెండో కుమారుడు అఖిల్ కాంబినేషన్‌లోనూ రాము కలిసి పనిచేశారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా కోసం కాదు.. ఒక షార్ట్ ఫిలిం కోసం వీరి కాంబినేషన్ కలిసి పనిచేసిందని తెలిసింది.
ప్రస్తుతం నాగార్జునతో తెరకెక్కిస్తున్న సినిమా చిత్రీకరణ సమయంలో అఖిల్‌కి రాము ఒక కథ చెప్పారని...అది అఖిల్‌కి నచ్చడంతో వెంటనే ఓకే చేసేశారని సమాచారం. అనుకున్నదే తడవుగా....రాము, ఈ ఫిలింని చిత్రీకరించేసారు. ఫిలిం చాలా బాగా వచ్చిందని...చాలా డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారని తెలుస్తోంది. ఒక మంచి ముహూర్తం చూసుకుని ఈ షార్ట్ ఫిలింని రిలీజ్ చేయనున్నారు రాము అండ్ టీం. అసలే హీరోలని చాలా వైవిధ్యంగా చూపించే రాము ఈ షార్ట్ ఫిలింలో.. ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా అఖిల్‌ని పరిచయం చేస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com