అఖిల్ తో ఆర్జీవీ

  • IndiaGlitz, [Thursday,January 25 2018]

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు అక్కినేని నాగార్జునకి ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో.. శివ' చిత్రం రూపంలో ఓ ట్రెండ్ సెట్టర్ సినిమాని అందించారు సంచ‌ల‌న‌ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు నాగార్జున రెండో కుమారుడు అఖిల్ కాంబినేష‌న్‌లోనూ రాము క‌లిసి ప‌నిచేశార‌ని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా కోసం కాదు.. ఒక షార్ట్ ఫిలిం కోసం వీరి కాంబినేష‌న్ క‌లిసి ప‌నిచేసింద‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం నాగార్జునతో తెరకెక్కిస్తున్న సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అఖిల్‌కి రాము ఒక కథ చెప్పారని...అది అఖిల్‌కి నచ్చడంతో వెంటనే ఓకే చేసేశారని సమాచారం. అనుకున్నదే తడవుగా....రాము, ఈ ఫిలింని చిత్రీకరించేసారు. ఫిలిం చాలా బాగా వచ్చిందని...చాలా డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారని తెలుస్తోంది. ఒక మంచి ముహూర్తం చూసుకుని ఈ షార్ట్ ఫిలింని రిలీజ్ చేయనున్నారు రాము అండ్ టీం. అసలే హీరోలని చాలా వైవిధ్యంగా చూపించే రాము ఈ షార్ట్ ఫిలింలో.. ఇంత‌కుముందు ఎప్పుడూ చూడ‌ని విధంగా అఖిల్‌ని పరిచయం చేస్తారేమో చూడాలి.

More News

అనిరుధ్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే..

రానాకి కథ చెప్పిన సీనియర్ డైరెక్టర్

‘బాహుబలి’సిరీస్ ఇచ్చిన విజయంతో వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలు ఎంచుకుంటున్నాడు యంగ్ హీరో దగ్గుబాటి రానా.

కణం వాయిదా పడిందా?

ఫిదా చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మలర్ బ్యూటీ సాయిపల్లవి..

కృష్ణకుమారి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు - డా.మంచు మోహన్ బాబు

"నేను కృష్ణకుమారిగారితో కలిసి నటించకపోయినా ఆమెతోపాటు మాత్రమే కాక ఆమె కుటుంబంతోనూ మంచి అనుబంధం ఉంది.

వినాయక్ గారి ఎంటర్ టైన్ మెంట్, మాస్ ఎలిమెంట్స్ తో ఎనర్జిటిక్ గా ఉండే 'ఇంటిలిజెంట్ ' - సి.కల్యాణ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.