కేసీఆర్‌కు వర్మ విస్కీ ఛాలెంజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతోన్న సమయంలో సినిమా సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అందరూ వారికి నచ్చిన పనులు చేయడమే కాకుండా.. కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. మరికొందరు తమ తోటి స్టార్స్‌కు ఛాలెంజ్‌లను విసురుతున్నారు. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాత్రం తానెంతో డిఫరెంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఓ ప్రముఖ ఛానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్‌గోపాల్ వర్మను యాంకర్ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. మీరు ఛాలెంజ్ విసరాలనుకుంటే ఎవరికీ విసురుతారు? అని అడిగారు. దానికి వర్మ తిరుగులేని సమాధానం ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి విస్కీ ఛాలెంజ్‌ను విసరాలనుకుంటున్నానని అన్నారు. అందు కారణాన్ని కూడా చెప్పారు ఆర్జీవీ. ఎవరూ మందు తాగని ఈ సమయంలో కేసీఆర్ లైవ్‌లో అందరినీ ఉడికించేలా ఓ గ్లాస్ విస్కీ తాగాలని, అది చూసి అందరూ గింజుకుంటుంటే తాను దాన్ని ఓ వెబ్ సిరీస్‌లా తీస్తానని అన్నారు వర్మ. అయితే దీనిపై నెటిజన్స్ కాస్త గరం గరం అయ్యారు. కరోనా వైరస్ నివారణకు గొప్పగా కృషి చేస్తున్న కేసీఆర్‌పై విస్కీ ఛాలెంజ్ విసురుతావా? అంటూ వర్మపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com