ఆయన ఓడిపోవాలని శపించిన ఆర్జీవీ!
Send us your feedback to audioarticles@vaarta.com
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ప్రజలు చూడకుండా ఆపుతున్న తెరవెనుక ఉన్న 'వెన్నుపోటు డైరెక్టర్' ఓడిపోవాలని టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శపించారు. శుక్రవారం సినిమా రిలీజ్ అయిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టిన ఆర్జీవీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌మీట్‌కు ముందు ఆర్జీవీ వరుస ట్వీట్లతో సినిమాను అడ్డుకున్న వారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘వెన్నుపోటు డైరెక్టర్’ ఓడిపోవాలని తనలాంటి కోట్లాది మంది ఎన్టీఆర్ అభిమానులు కమండలంలోని నీళ్లు తీసి శపిస్తున్నామని వర్మ వ్యాఖ్యానించారు.
హతవిధీ..!
"ప్రప్రధమంగా తెలుగు ప్రజలను విడగొట్టిన ఘనత దురదృష్టవశాత్తు, లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దక్కింది. కోర్ట్ ఆర్డర్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో తప్ప తెలంగాణలోనూ ఇంకా ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లందరూ సినిమా చూడొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేరు. హత విధి!" అని ఆర్జీవీ వ్యాఖ్యానించారు.
మానసిక క్షోభ..
"తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టిన అతి గొప్ప తెలుగువాడి మరణానికి దారి తీసిన మానసిక క్షోభ సినిమా రిలీజ్ రోజు తెలుగు వాళ్ళల్లో కొంత మందే చూస్తుంటే ఇంకా ఎందరో కేవలం ఎదురు చూసే పరిస్థితి కల్పించిన ఆ వెన్నుపోటుదారుడెవరో?" అని ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా హల్ చల్ చేశారు.
తథాస్తు..!
"సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే కథతో రూపొందిన ఈ సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్ ని నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలం లో నీళ్లు తీసి శపిస్తున్నాం ..ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక .. తథాస్తు"అని వర్మ ట్వీట్టర్ వేదికగా శపించారు.
కుట్రలో ఎన్టీఆర్ బలి..
శుక్రవారం సినిమా రిలీజ్ అయిన అనంతరం ప్రెస్మీట్లో మాట్లాడిన ఆర్జీవీ.."ఎన్టీఆర్ జీవితంలో సంఘటనలు, నేను తెలుసుకున్న నిజాలు కలబోసి ఈ సినిమా తీశాను. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతికి పరిచయం, తర్వాత వారిమధ్య పెరిగిన అనుబంధం, కుట్రలకు ఎన్టీఆర్ ఎలా బలైపోయారు అన్న సంఘటనలతోనే ఈ సినిమా తీశాం. వైసీపీకి మేలు చేసేందుకే ఈ సినిమా తీశామన్న ఆరోపణల్లో నిజం లేదు.
ఈ సినిమా ప్రజలు చూస్తే తమ ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు ఆందోళన పడటం హాస్యాస్పదంగా ఉంది" అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. అయితే ఆర్జీవీ ట్వీట్స్‌కు పెద్ద ఎత్తున అభిమానులు, సినీ ప్రియులు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆర్జీవీ మాటల తూటాలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout