బాలయ్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రాన్ని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు బాలయ్యకు అంకితమిస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ పాత్రికేయులతో మాట్లాడుతూ.. సినిమా తెరకెక్కించాలని భావించిన నాటి నుంచి నేటి వరకు అసలేం జరిగింది..? ఆయనకు వార్నింగ్ ఇచ్చిందెవరు..? అనే ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఏ పేజీలనయితే చింపేయాలనుకున్నారో.. ముఖ్యంగా చివరి రోజుల్లోని చరిత్రను చెరిపివేయాలని అనుకున్నారో ఆ అంశాలను తీసుకొని తాను ముందుకొచ్చానన్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరయిన తర్వాత జరిగిన పరిణామాలతో రూపొందుతున్న చిత్రమే నా ఈ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. కాగా మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా బాలయ్యకు ఈ సినిమాను ఆర్జీవీ అంకితమివ్వడాన్ని ఊహించని గిఫ్ట్ అని వర్మ అభిమానులు, నెటిజన్లు చెబుతున్నారు.
బాలయ్యకు అంకితమిస్తున్నా..
ప్రతి సినిమా చేయడం వెనుక ఓ వ్యక్తి తప్పకుండా స్ఫూర్తిగా ఉంటారన్నారు. "లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేయడానికి నాకు స్ఫూర్తినిచ్చిన ఏకైక వ్యక్తి బాలకృష్ణ. ఈ సినిమాను ఆయనకే అంకితం ఇస్తున్నాను. బాలకృష్ణకు ఎందుకు అంకితం ఇస్తున్నానో అనే దాని వెనుక పెద్ద కథ ఇది. ఆ విషయాలు ఇప్పుడు చెప్పలేను.. చెప్పేంత టైమ్ లేదు.. నిదానంగా చెబుతాను. ఈ సినిమాకు సంబంధించిన నిజాల్ని నేను అప్పటి ఘటనలకు సాక్ష్యంగా ఉన్న తటస్థ వ్యక్తుల వద్ద సేకరించాను. ఎందుకుంటే వారు ఎలాంటి సంశయం లేకుండా నిజాలు చెబుతారు" అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
ఆర్జీవీ స్వీట్ వార్నింగ్...
అయితే ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతి మధ్య అనుబంధాన్ని రెండున్నర గంటల్లో చూపించడం సాధ్యం కాదని.. కాబట్టివారి కథలోని ఆత్మను అప్పటి ముఖ్య సంఘటనల్ని మాత్రమే సినిమాలో చూపించానన్నారు. తన కెరీర్‌లోనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చాలా ప్రత్యేకమైన సినిమా అని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఈ సినిమా తీయడం వల్లనే క్రేజ్ రాలేదు.. కానీ కథాంశంలోని సంఘర్షణే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నదన్నారు. "ఈ సినిమా విషయంలో నిజంగా నాకు ఇప్పటివరకు ఎలాంటి బెదిరింపులు రాలేదు. టీవీ చర్చల సందర్భంగా ఎవరో కొందరు ఫోన్‌చేసి వార్నింగ్ ఇచ్చేవారు. అంతేకానీ నేను బెదిరే స్థాయిలో ఎవరూ బెదిరింపులు చేయలేదు. ఒకవేళ ఎవరైనా నన్ను బెదిరిస్తే నేను కూడా వారిని తిరిగి బెదిరిస్తాను" అని ఆర్జవీ ఈ సందర్భంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ నేతలు.. బాలయ్య నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout