9 pm 9 మినిట్స్‌... వ‌ర్మ స్టైలే వేరు

ప్ర‌స్తుతం దేశం క్లిష్ట‌ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది. క‌రోనా వైర‌స్‌ను పార‌ద్రోల‌డానికి దేశం యావ‌త్తు శ‌క్తి వంచ‌న లేకుండా పోరాడుతుంది. సామాజిక దూరాన్ని పాటిస్తూ మ‌న స‌మైక్య‌త‌ను పాటిస్తున్నామ‌ని అందుకు ప్ర‌తీక‌గా ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు క‌రెంటును ఆపు చేసి దీపాల కాంతిని ప్ర‌సారం చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశం యావ‌త్తు ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను పాటించారు. ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, సామాన్యులు అంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌మ‌య్యారు.

సినిమా రంగం విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి మ‌రియ ఆయ‌న కుటుంబ స‌భ్యులు, నాగార్జున మ‌రియు కుటుంబ స‌భ్యులు, వెంక‌టేశ్, మోహ‌న్‌బాబు, మ‌హేశ్ మ‌రియు కుటుంబ స‌భ్యులు, ర‌జినీకాంత్‌, అక్ష‌య్‌కుమార్, స‌హా ఎంటైర్ ఇండ‌స్ట్రీ 9 pm 9 మినిట్స్‌తో వెలుగులు విర‌జిమ్మారు.

వ‌ర్మ స్టైలే వేరు…

ఊరంద‌రిదీ ఒక దారైతే దానిదేదో మ‌రోదారి అన్న‌ట్లు వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌నదైన స్టైల్లో విల‌క్ష‌ణంగా లైట‌ర్‌తో సిగ‌రెట్‌ను వెలిగించుకుని ఆ వీడియో పోస్ట్ చేశారు. పొలిటీషియ‌న్స్ రూల్స్‌ను పాటించ‌క‌పోతే క‌రోనా వైర‌స్ కంటే మ‌రింత ప్ర‌మాద‌క‌రం అని మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశారు.