9 pm 9 మినిట్స్... వర్మ స్టైలే వేరు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం దేశం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటుంది. కరోనా వైరస్‌ను పారద్రోలడానికి దేశం యావత్తు శక్తి వంచన లేకుండా పోరాడుతుంది. సామాజిక దూరాన్ని పాటిస్తూ మన సమైక్యతను పాటిస్తున్నామని అందుకు ప్రతీకగా ఆదివారం రాత్రి 9 గంటలకు కరెంటును ఆపు చేసి దీపాల కాంతిని ప్రసారం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశం యావత్తు ఆయన చెప్పిన మాటలను పాటించారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు, సామాన్యులు అందరూ ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.
సినిమా రంగం విషయానికి వస్తే.. చిరంజీవి మరియ ఆయన కుటుంబ సభ్యులు, నాగార్జున మరియు కుటుంబ సభ్యులు, వెంకటేశ్, మోహన్‌బాబు, మహేశ్ మరియు కుటుంబ సభ్యులు, రజినీకాంత్, అక్షయ్‌కుమార్, సహా ఎంటైర్ ఇండస్ట్రీ 9 pm 9 మినిట్స్‌తో వెలుగులు విరజిమ్మారు.
వర్మ స్టైలే వేరు…
ఊరందరిదీ ఒక దారైతే దానిదేదో మరోదారి అన్నట్లు వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన స్టైల్లో విలక్షణంగా లైటర్‌తో సిగరెట్‌ను వెలిగించుకుని ఆ వీడియో పోస్ట్ చేశారు. పొలిటీషియన్స్ రూల్స్‌ను పాటించకపోతే కరోనా వైరస్ కంటే మరింత ప్రమాదకరం అని మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశారు.
9 PM Disclaimer : Not following Corona warnings is far more dangerous than not following government warnings on cigarette smoking pic.twitter.com/Few9fyXhOg
— Ram Gopal Varma (@RGVzoomin) April 5, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout