ఆర్జీవీ తాతయ్య అయ్యాడోచ్..!?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాతయ్య అయ్యాడు. ఇవాళ ఉదయం 7:30 గంటలకు ఆయన కుమార్తె రేవతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు, కుటుంబీకులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా.. ఆర్జీవీ కుమార్తె రేవతి వర్మ కుమార్తె వివాహం 2013లో జరిగింది. వృత్తి రీత్యా వైద్యురాలైన రేవతి.. డాక్టర్ అయిన ప్రణవ్ను పెళ్లిచేసుకుంది. వీరిద్దరూ ప్రేమలో మునిగితేలి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. తాజాగా రేవతి-ప్రణవ్ ఇంట ఆడబిడ్డ అడుగుపెట్టబోతోంది.
మార్పు వస్తుందా..!?
సో.. ఇన్ని రోజులు బంధాలు, బంధుత్వాలకు దూరంగా ఉంటున్నట్లు బిహేవ్ చేసే రామ్ గోపాల్ వర్మ ఇకపై అయినా మనువరాలి కోసం కాసింత సమయం కేటాయిస్తాడేమో వేచి చూడాలి. అయితే.. ‘నా జీవితం, నా ఇష్టం’ అనుకొనే తత్వం రామ్గోపాల్ వర్మది అన్న విషయం తెలిసిందే. అనుబంధాలకు ఆయన పెద్ద విలువ ఇవ్వరు.. మరి ఇప్పుడైనా కాస్త ఆయనలో మార్పు వస్తుందో లేదో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com