‘పవర్ స్టార్’లో వర్మ పవన్‌ను సీఎంని చేస్తారట..

పవన్ కల్యాణ్ బయోపిక్‌ను ‘పవర్ స్టార్’ పేరుతో వర్మ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీని కోసం అచ్చం పవన్‌లా ఉండే వ్యక్తిని కూడా వర్మ ఎంపిక చేసుకున్నారు. అతని పేరు చల్లకోటి నరేష్. భద్రాచలం పట్టణానికి చెందిన వ్యక్తి. పవన్‌కు సంబంధించిన సన్నివేశాలతో వీడియోలు చేసి నరేష్ టిక్‌టాక్‌ స్టార్ అయిపోయాడు. అయితే స్వతహాగా పవన్‌కు అభిమాని అయిన నరేష్.. ఆయనకు యాంటీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నటించేందుకు ఎలా ఒప్పుకున్నాడా? అని అంతా తొలుత భావించారు.

అయితే ఈ అనుమానాలకు కాస్త క్లారిటీ వచ్చేసింది. నరేష్‌కు ఈ సినిమాను పవన్‌కు అనుకూలంగా తీస్తున్నట్టు చెప్పి వర్మ ఒప్పించారట. పవన్‌ను ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా చూపిస్తున్నామని.. వచ్చే ఎన్నికల్లో పవన్ కీలకంగా మారుతాడు అని చెప్పి నరేష్‌ని వర్మ ఒప్పించారని తెలుస్తోంది. అసలే వర్మకు మాట మీద నిలబడరనే పేరు ఉండనే ఉంది. మరి నరేష్‌కు ఇచ్చిన ఈ మాటను నిలబెట్టుకుంటారో.. లేదంటే తూచ్ అనేస్తారో వేచి చూడాలి.

More News

ప్రధాని మెచ్చిన ప్రతాప్.. ఎంతటి విజయాన్ని సాధించాడో తెలిస్తే

కర్ణాటకలోని మైసూరుకు సమీపంలోని కాడైకుడికి చెందిన ప్రతాప్(21) పేరు ఇప్పుడు దేశం మొత్తం మార్మోగుతోంది.

క్లారిటీ ఇచ్చిన పాయ‌ల్ రాజ్‌పుత్‌

తొలి తెలుగు చిత్రం ‘ఆర్‌.ఎక్స్‌100’తో హాట్ బ్యూటీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌కు త‌ర్వాత చేసిన ‘ఆర్.డి.ఎక్స్ ల‌వ్‌, వెంకీమామ‌,

టీచర్ పాఠం చెబుతుండగా.. క్లాస్ రూంలోకి సడెన్‌గా వచ్చిన ఏనుగు..

టీచర్ ఏనుగు గురించిన పాఠం చెబుతోంది. ఆమె వన్.. టు.. త్రి అనగానే క్లాస్ రూంలోకి ఏనుగు వచ్చి చిన్నారుల ముందు నిలబడింది. పిల్లలంతా షాక్ అయ్యారు.

‘వి’ కోసం అర‌వింద్ ప్ర‌య‌త్నాలు..!!

వెండితెర నుండి డిజిట‌ల్ రంగం వైపుకు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆక‌ర్షితుల‌వుతున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో కీర్తి..?

‘మ‌హాన‌టి’తో జాతీయ అవార్డు ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ ఒక ప‌క్క మ‌హిళా ప్ర‌ధాన‌మైన చిత్రాల‌తో పాటు, స్టార్ హీరో సినిమాల్లో న‌టిస్తూ మెప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.