నడిరోడ్డు పై ప్రెస్మీట్ రద్దు.. పోలీసుల అదుపులో ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 01న ఆర్జీవీ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఆంధ్రప్రదేశ్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్కు ముందు చిత్రబృందం అంతా విజయవాడలోని నోవాటెల్ హోటల్ ప్రెస్మీట్ నిర్వహించాలని అనుకుంది. అయితే ఆ హోటల్ వాళ్లకు ఎవరో వార్నింగ్ ఇవ్వటం మూలాన భయంతో రద్దు చేసేశారు. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోటల్స్, క్లబ్లు, మేనేజిమెంట్లు.. మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
నడిరోడ్డుపై ప్రెస్మీట్..
"నేను పైపుల రోడ్డులో NTR circle దగ్గరనడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను. మీడియా మిత్రులకి.. ఎన్టీఆర్ నిజమైన అభిమానులకి, నేనంటే అంతో.. ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొనటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం" అని ట్విట్టర్ పోస్ట్ చేసిన ఆర్జీవీ తన చిత్రబృందంతో కలిసి విజయవాడ బయల్దేరారు. అంతేకాదు లొకేషన్ కూడా మీడియా మిత్రుల కోసం ఆయన తన ట్విట్టర్లో షేర్ చేశారు.
పోలీసుల అదుపులో..
ఆర్జీవీ, రాకేశ్ రెడ్డి కలిసి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. నేరుగా విజయవాడకు వెళ్లి ప్రెస్మీట్ ఏర్పాట్లు మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న బెజవాడ పోలీసులు రంగప్రవేశం చేసి ఆర్జీవీని అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను తిరిగి హైదరాబాద్ పంపడానికి గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబందించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments