‘టీఆర్ఎస్’కు జై కొట్టిన ఆర్జీవీ.. ఎందుకంటే..!
- IndiaGlitz, [Tuesday,September 17 2019]
తెలంగాణలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీపై.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. అసలేం జరిగింది..? ఎందుకిలా ప్రశంసలు అనేది ఈ కథనంలో చూద్దాం. హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో అమ్మాయిలకు డ్రెస్ కోడ్ విధించడం.. అమ్మాయిలు రోడ్లెక్కి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని.. బట్టలు ఎలాంటి వేసుకోవాలుకే మాకు కండిషన్స్ పెడతారా అంటూ విద్యార్థులు కాలేజీ మందు ధర్నా చేసి సక్సెస్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులను అభినందనలు తెలిపిన.. ఆయన మంత్రి కేటీఆర్‌పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వావ్, ప్రగతిశీల ప్రభుత్వం అంటే ఇదే. జై టీఆర్ఎస్’ అని ఆర్జీవీ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇందుకు స్పందించిన అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.