'దిశ' షూటింగ్ ప్రారంభించిన ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఎమోషనల్ స్క్రిప్టును ఎంచుకున్నానని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. యథార్థ కథాంశాలతో సినిమాలు తీసే ఆర్జీవీ.. తెలుగు నాట సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనపై సినిమా తీయాలని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యాడు. ముందుగా ప్రకటించినట్లే.. మాట మీద కాకుండా కాళ్ల మీద మాత్రమే నిలబడే ఆర్జీవీ.. అసలు దిశ ఘటన ఎలా జరిగింది..? ఆ రోజు ఏం జరిగింది..? ఎందుకు వాళ్లు అలా చంపేయాల్సి వచ్చింది..? అనే ఘోర నిజాలు ఈ సినిమాలో చూపించబోతున్నాడు.
షూటింగ్ షురూ!
అయితే.. దిశను ఎక్కడైతే కాల్చి చంపారో.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని అదే చటాన్ పల్లి సమీపంలోనే తొలి షాట్‌ను ఆర్జీవీ చిత్రీకరించాడు. ఫిబ్రవరి 29 రాత్రి తొలిషాట్‌కు ముహుర్తం కార్డు పడింది. కాగా ఈ ఘటన రాత్రి పూట జరగడంతో షూటింగ్ కూడా రాత్రి సమయంలోనే ప్రారంభించాడు ఆర్జీవీ. ఈ ఘటనకుసంబంధించి కీలక సన్నివేశాలను బ్రిడ్జి కింద ఆయన షూట్ చేస్తున్నారు. దిశపై తొండుపల్లి టోల్ గేట్ వద్ద అత్యాచారం చేసిన తర్వాత మృతదేహాన్ని చటాన్‌పల్లి శివారులో దహనం చేసేందుకు లారీలో తీసుకొచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించారు. అనంతరం ఆ మృతదేహాన్ని కాల్చడం, స్కూటీ, లారీతో సన్నివేశాన్ని కూడా చిత్రీకరించారు. కాగా.. ఈ పరిసర ప్రాంతాల్లోనే సుమారు 15 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
ఇదివరకే కేశవులు భార్యతో భేటీ!
ఈ సినిమా కథలో భాగంగా.. ‘దిశ’ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యతో ఆర్జీవీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమెతో నిశితంగా చర్చించిన ఆయన.. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చెన్నకేశవులు భార్యను ఇప్పుడే కలిశాను. ఆమె రేపిస్ట్ చెన్నకేశవులు భార్య. 16 ఏళ్ల వయసులో ఆమెను చెన్నకేశవులు పెళ్లి చేసుకున్నాడు. అతడి బిడ్డకు ఆమె 17 ఏళ్ల వయసులో జన్మనివ్వనుంది. దిశ జీవితాన్నే కాదు.. అతడు తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడు. ఒక చిన్నారి అయ్యుండి ఆమె మరో చిన్నారికి జన్మనిస్తుంది. వారిద్దరికీ మంచి భవిష్యత్తు లేదు’ అని ఒకింత భావోద్వేగంతో ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు, వీరాభిమానులు చిత్ర విచిత్రాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే సారూ.. ఆమెకు ఆర్థికంగా సాయం చేయండి అని సలహా ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com