వివాదానాకి తెరలేపిన వర్మ...
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదం లేకపోతే వర్మకు నిద్ర పట్టదేమో కాబోలు. ఇప్పుడు కొత్త వివాదానికి తెర తీశాడు. అది కూడా మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై. గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ జీవితాన్ని సినిమా రూపంలో తెరకెక్కిస్తానని తెలిపిన వర్మ. రీసెంట్గా సోషల్ మీడియాలో తనదైన శైళిలో స్పందించాడు. ఎన్టీఆర్‌గారి జీవితంపై రీసెర్చ్ చేసిన తర్వాత తన నిర్ణయం మారిందని, తాను తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీపార్వతి సైడ్ నుండి ఉంటుందని, కాబట్టి తన సినిమాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని పేరు పెట్టినట్టు తెలిపారు ఆర్.జి.వి.
లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ను అర్థం చేసుకున్న తీరును బట్టి చూస్తే ఆ అంశాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఎన్టీఆర్‌కు ఎదురైన పరిస్థితులను, ఇతర లోతైన అంశాలతో పాటు, ఎన్టీఆర్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలను, ఆయన్ని వెన్నుపోటు పొడిచిన వారి గురించి నా చిత్రంలో ప్రస్తావిస్తానని కూడా చెప్పడం సెన్సేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి ఇంకా ఎలాంటి దుమారం రేగుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com