స్పీడు పెంచుతున్న వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాస్పద దర్శకుడు వర్మ ఏదైనా డిఫరెంట్‌గానే ఆలోచిస్తాడు. అందరూ కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్స్ మానేసి ఇళ్లకే పరిమితమయ్యారు., అయితే రామ్‌గోపాల్ వర్మ మాత్రం క్లైమాక్స్ అనే సినిమా చేసేశాడు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వర్మ తెరకెక్కించిన క్లైమాక్స్ రీసెంట్గా ఆర్జీవీ వరల్డ్‌లో విడుదలైంది. పే ఫర్ వ్యూ కింద వంద రూపాయలు వసూలు చేశాడు ఆర్జీవీ. అలాగే కరోనా వైరస్ అనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఇదింకా విడుదల కాకమునుపే అదే ఊపులో నగ్నం(నెక్డ్) అనే సినిమా టీజర్‌ను విడుదల చేసి తదుపరి సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు వర్మ.
నగ్నం సినిమాను విడుదల చేయకముందే మరో సినిమాను అనౌన్స్ చేసి తన స్పీడేంటి? అనేది రుజువు చేసుకున్నాడు ఆర్జీవీ. గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేపై సినిమా చేస్తున్నట్లు చెప్పిన వర్మ ‘ద మేన హు కిల్డ్ గాంధీ’పేరుతో సినిమాను అనౌన్స్ చేశాడు. అలాగే కిడ్నాప్ ఆఫ్ కత్రినా అనే మరో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇలా వరుస సినిమాలతో టెక్నాలజీని వాడుకోవడంలో నా అంత ఎవరూ లేరని మరోసారి రుజువు చేసే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ. మరి ఈ సినిమాలను ఎప్పుడు విడుదల చేస్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com