జొన్నవిత్తులపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాలకు కేరాఫ్‌గా పేరుగాంచిన.. వివాదాలే ఊపిరిగా భావించే రామ్‌గోపాల్ వర్మ ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అనే మూవీతో మరో సంచలనానికి తెరలేపుతున్న విషయం విదితమే. తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు మీడియా ముఖంగా.. సోషల్ మీడియా వేదిగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.. ఆర్జీవీ చిత్రంపై మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జొన్నవిత్తుల ఏమన్నారు..!?
‘దిక్కుమాలిన ఆలోచనలతో వివాదాస్పద సినిమాలు తీస్తున్నాడు. వర్మ ఎంతో ప్రమాదకారి. వర్మ తనకు టీవీ చర్చా కార్యక్రమంలో జొన్నవిత్తుల చౌదరి అనే బిరుదు ఇచ్చాడు. అందుకే వర్మపై ‘పప్పు వర్మ’ అనే బయోపిక్ తీస్తాను’ అని జొన్నవిత్తుల వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపిచారు.
ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ ఇవీ...
‘ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్! నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబీ.. లేకపోతే ఫ్రస్ట్రేషన్‌తో చచ్చిపోతావ్ జొన్నా. నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్.. వాళ్ళ మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్, కానీ ఐ లవ్ యు డా’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో అక్కడక్కడా ఎమోజీలు తగిలించారు. అంతేకాదు జొన్నవిత్తుల ఫొటోను ఆర్జీవీ చేశారు. మొత్తానికి చూస్తే వీరిద్దరి మధ్య వివాదం మరింత ముదిరే పరిస్థితులు మెండుగా ఉన్నాయి. అయితే ఆర్జీవీ వ్యాఖ్యలపై జొన్నవిత్తుల ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout