RGV: పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్‌ మీద పోటీ చేస్తాను.. ఆర్జీవీ సంచలన ట్వీట్..

  • IndiaGlitz, [Thursday,March 14 2024]

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఎప్పుడూ ఎలాంటి ట్విస్టులు ఇస్తారో ఊహించడం కష్టం. తనకు నచ్చిన విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. ఆర్జీవీ వ్యవహారశైలిని కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తే.. మరికొంతమంది మాత్రం మద్దతు ఇస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. తాను ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు ప్రకటించారు. సాధారణంగా దీనికి ఎవరూ పెద్ద రియాక్ట్ కారు. కానీ ఆర్జీవీ పోటీ చేస్తానన్నది ఎవరి మీదో చెబితే షాక్ కావాల్సిందే.

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే ఆ ప్రకటన వచ్చిన వెంటనే ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించాడు. తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు తెలిపాడు. ఈమేరకు ఓ ట్వీట్ కూడా చేశాడు.

సడన్‌గా తీసుకున్న నిర్ణయం.. పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను. ఎన్నికల బరిలో దిగబోతున్నాననే విషయం చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అన్నాడు. దీంతో ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్‌పై సెటైరికల్‌గా ట్వీట్ చేశారా? లేదా పవన్‌కు పోటీగా నిజంగానే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎక్కువ మంది మాత్రం సెటైరికల్‌గానే ట్వీట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఇప్పటికే ఏపీ రాజకీయాలపై ఆర్జీవి రచ్చ రచ్చ చేస్తున్నాడు. తొలి నుంచి ఆయన అధికార వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను సెటైర్లుగా విమర్శిస్తూ సినిమాలు తీశాడు. కమ్మరాజ్యం కడప రెడ్లు, వ్యూహం, శపథం వంటి సినిమాలు తీశాడు. ఈ చిత్రాల్లో సీఎం జగన్‌ను హైలెట్ చేస్తూ చంద్రబాబు, పవన్‌లను ఘోరంగా ట్రోల్ చేశారు. వీటిపై విపరీతమైన విమర్శలు వచ్చినా.. నా సినిమాలు నా ఇష్టం అంటూ కౌంటర్లు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏకంగా పవన్ మీద పోటీ చేస్తానంటూ ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

More News

Mallareddy: కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదు.. డీకే శివకుమార్‌ను అందుకే కలిశా: మల్లారెడ్డి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Election Commission: కొత్త కేంద్ర ఎన్నికల కమిషనర్లు నియామకం.. శుక్రవారమే ఎన్నికల షెడ్యూల్..!

లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌భీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన హైపవర్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ పోటీ చేసే స్థానం ఇదే.. వెల్లడించిన సేనాని..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వీడింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్‌ స్వయంగా వెల్లడించారు.

చంద్రబాబు పేరు చెబితే వంచనే గుర్తొస్తుంది.. సీఎం జగన్ విమర్శలు..

ఒకరు చెబితే వంచన, మరొకరు పేరు చెబితే మ్యారేజ్ స్టార్ పేర్లు గుర్తుకొస్తాయని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. నంద్యాల జిల్లా

OTT: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. 18 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌పై నిషేధం..

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీల కంటెంట్ ఎక్కువగా ఉన్న 18 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రసార, సమాచార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.