జగన్‌ను కాపాడేందుకు రఘురామ కృష్ణంరాజు వచ్చాడంటూ వర్మ సంచలన ట్వీట్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో రఘురామకృష్ణంరాజు(ఆర్ఆర్ఆర్) పోలుస్తూ ఆయన ట్వీట్ చేశారు. థియేటర్స్‌ను కాపాడేందుకు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ.. వైసీపీని కాపాడేందుకు మాత్రం ఆర్ఆర్ఆర్ వచ్చేశాడని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘ప్రేక్షకులకు అత్యంత అభిమానించే చిత్రం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్స్‌ను కాపాడేందుకు ఎప్పుడు వస్తుందో చెప్పలేను కానీ జగన్‌ని ప్రేమించే ఆర్ఆర్ఆర్(రఘురామకృష్ణంరాజు) మాత్రం వైసీపీని కాపాడేందుకు ఇప్పటికే వచ్చేసినందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా.. వైసీపీలో ఇటీవల అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రఘురామ కృష్ణంరాజు వైసీపీలోని కొందరి వైఖరిని బహిరంగంగా విమర్శించడంతో పరిస్థితులు హాట్ హాట్‌గా మారిపోయాయి. మరోవైపు తనకు ప్రాణహాని ఉందంటూ రఘురామ కృష్ణంరాజు లోక్‌సభ స్పీకర్, అజయ్ భల్లాను కలిసి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఆయన సీఎం జగన్‌పై మాత్రం ఎలాంటి విమర్శలూ నేటి వరకూ చేయలేదు. ఈ నేపథ్యంలో వర్మ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

More News

పని పాట లేని లోకేష్ పబ్జీ ఆడుకొంటున్నాడు: రోజా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మరోసారి వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహాత్ముని ఫోటో సబబే.. కానీ మిగిలిన నేతలెక్కడ?: నాగబాబు

భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి మహామహులు ఎందరో ఉన్నారని... వారందరినీ ప్రజలు మరచిపోతున్నారని ముఖ్యంగా పిల్లలకు తెలియటం లేదని మెగా బ్రదర్ నాగబాబు

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. ప్రతి 3 టెస్టులకు ఒక పాజిటివ్

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నిన్న నిర్వహించిన టెస్టుల ప్రకారం చూస్తే ప్రతి మూడు టెస్టులకు గాను ఒక పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది.

పలాస దర్శకుడి వెబ్ సిరీస్..!

తొలి చిత్రం ‘ప‌లాస 1978’ సినిమాతో అటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించి ఇటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు క‌రుణ కుమార్‌.

మ‌రో హిస్టారిక్ మూవీ ఘాజీ ద‌ర్శ‌కుడు

సంక‌ల్ప్ రెడ్డి.. `ఘాజీ`, `అంత‌రిక్షం` సినిమాలో అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించాడు.