ఛానెల్ ఎడిట‌ర్‌పై ఆర్జీవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌

ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో షూటింగ్‌ల‌కు మేక‌ర్స్ దూరంగా ఉంటున్నారు. కానీ.. వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మాత్రం తాను మాత్రం అంద‌రికీ భిన్నం అని రుజువు చేసుకుంటున్నారు. ఎలా సినిమాలు చేస్తున్నాడో చెప్ప‌డం లేదు కానీ.. వ‌రుస సినిమాలు చేస్తూ త‌న ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుద‌ల చేసుకుంటూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే క్లైమాక్స్‌, న‌గ్నం, ప‌వ‌ర్ స్టార్ సినిమాలు విడుద‌ల చేసిన ఆర్జీవీ తాజాగా రెండు చిత్రాల‌ను వ‌రుస రోజుల్లో అనౌన్స్ చేయ‌డం విశేషం. అందులో ఆదివారం రోజున చిరంజీవి బావ మ‌రిది అల్లు అర‌వింద్‌ను టార్గెట్ చేస్తూ ‘అల్లు’ అనే ఫిక్ష‌నల్ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సోమ‌వారం రోజున మ‌రో కొత్త సినిమాను ప్ర‌క‌టించాడు ఆర్జీవీ. ఆ కొత్త సినిమానే ‘అర్నాబ్’. ఇంగ్లీష్ ఛానెల్ రిపబ్లిక్ టీవీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ అయిన అర్నాబ్ గోస్వామి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌లో బాలీవుడ్‌ను విల‌న్‌గా చిత్రీక‌రించ‌డంలో ఆర్నాబ్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్జీవీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

‘‘అర్నాబ్ బాలీవుడ్ గురించి చాలా లోకువగా మాట్లాడుతున్నాడు. నీచమైన ఇండ‌స్ట్రీ అని బాలీవుడ్‌ని భ‌యంక‌రంగా తిడుతున్నారు. రేపిస్ట్స్‌, గ్యాంగ్‌స్ట‌ర్స్ మాత్ర‌మే ఉన్న‌ట్లు మాట్లాడుతున్నాడు. పాతికేళ్ల కాలంలో జ‌రిగిన నాలుగు ఆత్మ‌హ‌త్య‌ల‌ను ఒక తాటిపై తెచ్చి మాట్లాడుతున్నాడు. ఈ నాలుగు ఆత్మ‌హ‌త్య‌లు వేర్వేరు సంద‌ర్భాల్లో, ప‌రిస్థితుల్లో జ‌రిగాయి. కానీ అర్నాబ్ అన్నింటికీ బాలీవుడ్ ప‌రిశ్ర‌మే కార‌ణ‌మన్న‌ట్లు మాట్లాడుతున్నారు. అంటే బాలీవుడ్ ప‌రిశ్ర‌మ ఏమైనా శ్మ‌శానంలోని ఆత్మ‌.. దాక్కుని ఉండి ర‌క్త‌దాహం వేసిన‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చే డ్రాకులానా? అనే ప్ర‌శ్న‌ను అర్నాబ్‌ను అడ‌గాల‌నుకుంటున్నాను. ఆదిత్య చోప్రా, క‌ర‌ణ్ జోహార్‌, మ‌హేశ్ భ‌ట్‌, షారూక్ ఖాన్‌, స‌ల్మాన్‌ఖాన్ మీరంతా ఏం చేస్తున్నారు? అర్నాబ్ మొరుగుతుంటే.. మీరు ఆఫీస్ టేబుల్స్ కింద దాక్కున్నారా? మీరు అత‌నికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌టానికి భ‌య‌ప‌డుతున్నారు. నేను అర్నాబ్‌పై ఓ సినిమాను చేయాల‌నుకుంటున్నాను. అత‌ని అస‌లు రంగును బ‌య‌పెడ‌తాను. నా సినిమా పేరు ‘అర్నాబ్‌.. న్యూ ప్రాస్టిట్యూట్’’’ అంటూ వ‌ర్మ అర్నాబ్ గోస్వామిపై మండిప‌డ్డారు.

More News

చెన్నై సేఫ్ అంటున్న త‌లైవా అండ్ టీమ్‌!!

మ‌న సీనియ‌ర్ స్టార్స్ అంద‌రూ షూటింగ్స్ స్టార్ట్ చేయాలంటే భ‌య‌ప‌డుతున్నారు. వీరిని ఇంత‌లా భ‌య‌పెడుతున్నదెవ‌రో కాదు..

ఆరు గెట‌ప్స్‌లో ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’.

సుశాంత్‌ని దారుణంగా కొట్టి చంపారు.. ఆధారాలతో వెల్లడించిన డాక్టర్ మీనాక్షి

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టు సుశాంత్‌ది ఆత్మహత్య అని తేల్చింది.

ఇళ‌య‌రాజాపై నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్యలు

మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ప్ర‌సాద్ ల్యాబ్స్ నుండి త‌న‌ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపుతున్నార‌ని, త‌న వాయిద్య ప‌రిక‌రాల‌ను నాశ‌నం చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

దేశంలో 18 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఇవాళ కూడా...

దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 18 లక్షలు దాటేశాయి. వరుసగా ఐదు రోజులుగా దేశంలో కరోనా కేసులు 50 వేలు దాటుతున్న విషయం తెలిసిందే.