నా కెరీర్ లో 'వంగవీటి' నా బెస్ట్ ఫిల్మ్ - వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్‌గోసాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో సెన్సేషనల్ మూవీ వంగవీటి. 80 దశకంలో విజయవాడ నగర రాజకీయాలతో పాటు దేశాన్ని కూడా తన వైపు తిప్పుకున్న వంగవీటి రాధా, మోహనరంగాలకు సంబంధించిన కథతో వంగవీటి సినిమా ఉంటుంది. ఈ సినిమాను డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందకు తీసుకురాబోతున్నారు.
ఈ సినిమా ఆడియో విడుదలను విజయవాడలో నిర్వహించారు. నేను డైరెక్టర్ కానప్పటి నుండి నాకు తెలిసిన కథ `వంగవీటి`. నేను కూడా చదువు కొనే రోజుల్లో వంగవీటి మోహనరంగా ర్యాలీలో పాల్గొన్నాను. . అప్పుడు విజయవాడలో జరిగిన పరిస్థితులు, వాతావరణాన్ని స్టడీ చేసి ఆ అవగాహనతో నేనో దర్శకుణ్ణి అయ్యాను. ఈ సినిమాతో నాకున్న ఎమోషనల్ బాండింగ్ మరే సినిమాతోనూ లేదు. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఫ్యాక్షన్ కావొచ్చు.. గ్యాంగ్‌స్టర్ కావొచ్చు లేదా హైదరాబాద్ గూండాయిజమ్ మీద తీసినవి కావొచ్చు.
ఇరవై ఏడేళ్ల నా కెరీర్‌లో వంగవీటి` నా బెస్ట్ ఫిల్మ్. నేనే దర్శకుణ్ణి కాబట్టి, ఈ మాట చెప్పడం సరి కాదేమో కానీ చెబుతున్నా! వివాదాస్పదఅంశంతో నిజజీవిత పాత్రల ఆధారంగా ఈ సినిమా తీయడం వల్ల ఎంతోమందికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా కూడా ముందుకొచ్చిన నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌గారికి థాంక్స్ అంటూ వంగవీటి సినిమాపై తన అభిప్రాయాన్ని మరోసారి తెలియజెప్పాడు రామ్‌గోపాల్ వర్మ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com