అంత మూర్ఖులు ఎవరూ లేరు - వర్మ..!
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషన్ వంగవీటి. ఈ మూవీ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ వేయడం...వివాదస్పదమైన కమ్మ - కాపు పాటను తొలిగిస్తానని వర్మ హామీ ఇవ్వడంతో కోర్టు కేసును కొట్టేయడం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈరోజు ఉదయం విజయవాడలో వర్మ వంగవీటి రాధా, వంగవీటి రత్నకుమారి లను కలిసారు. మధ్యాహ్నాం దేవినేని నెహ్రు ని కలిసిన అనంతరం మీడియాతో మీట్ అయ్యారు.
ఈ మీడియా సమావేశంలో వంగవీటి రాధా, రత్నకుమారితో జరిగిన చర్చలు గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. గొడవలును మరచిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ద్వారా మళ్లీ గొడవలు జరిగే అవకాశం ఉంది కదా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా...సినిమాలు చూసి కొట్టుకునేంత మూర్ఖులు ఎవరూ లేరు అన్నారు. వంగవీటి రంగ మరణించిన రోజుకు మూడు రోజుల ముందు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి కారణం ఏమిటి అని అడిగితే...కావాలని ప్లాన్ చేసి రంగా చనిపోయిన రోజుకు మూడు రోజులు ముందు రిలీజ్ చేయడం లేదు కేవలం యాధృచ్చికం అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments