ఫస్ట్ టైమ్ సారీ చెప్పిన వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలనానికి...వివాదానికి మరో పేరు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ...ఏదో రకంగా వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ తనకు ఏది అనిపిస్తే...అది దాచుకోకుండా...మనసులో మాటలను ట్విట్టర్ లో పెట్టి ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంటారు. ఇటీవల బ్రహ్మోత్సవం సినిమా గురించి.. మహేష్ డ్యాన్స్ గురించి.. వర్మ ట్విట్టర్ లో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడూ...తన మాటలతో...ట్విట్స్ తో ఇతరులను ఇబ్బంది పెట్టే వర్మ ఏనాడు ఎవరికీ క్షమాపణలు చెప్పలేదు. ఫస్ట్ టైమ్ వర్మ సారీ చెప్పారు. ఇంతకీ వర్మ ఎవరికి సారీ చెప్పారు...? ఎందుకు చెప్పారు..? అంటారా..?
విషయం ఏమిటంటే...వర్మ బాలీవుడ్ లో తెరకెక్కించిన తాజా చిత్రం వీరప్పన్. ఈ చిత్రం ఇటీవల రిలీజైంది. అయితే వీరప్పన్ సినిమా పై మహిళా జర్నలిస్ట్ శిల్పా జామ్కండికర్ నెగిటివ్ రివ్యూ రాసారు. దీంతో వర్మ ట్విట్టర్ లో...వ్యక్తిగత కారణాలను దృష్టిలో పెట్టుకుని కొందరు ఫిల్మ్ మేకర్స్ పై విమర్శలు చేస్తే...ఫిల్మ్ మేకర్స్ కూడా అదే విధంగా విమర్శిస్తారు అంటూ స్పందించారు. అంతటితో ఆగకుండా కొన్ని సామెతలను గుర్తు చేస్తూ రకరకాలుగా మహిళా జర్నలిస్ట్ శిల్ప పై విరుచుకుపడ్డారు. ఆతర్వాత ఏమైందో ఏమో...ఇప్పటి వరకు ఎవరికీ క్షమాపణలు చెప్పలేదు. ఫస్ట్ టైమ్ చెబుతున్నాను సారీ..శిల్పా అంటూ ట్వీట్ చేసారు. వర్మ మాటల వెనక మర్మం ఏమిటో...ఆయనలో ఈ మార్పుకు కారణం ఏమిటో ఆయనకే తెలియాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments