ఎన్టీఆర్కు మరోసారి వెన్నుపోటు : ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నో అడ్డంకులు.. మరెన్నో వివాదాల మధ్య వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మినహా ప్రపంచ వ్యాప్తంగా యథావిథిగా మార్చి-29 విడుదలైన విషయం విదితమే. అయితే ఏపీలో ఎందుకు రిలీజ్ కాలేదు.. అసలేం జరిగింది..? లోపం ఎక్కడుంది..? వర్మ వ్యూహాలు ఎక్కడ బెడిసికొట్టాయ్..? కోర్టు మెట్లెక్కినప్పటికీ ఆర్జీవీ ఎందుకు న్యాయం జరగలేదు..? అనే వివరాలను ఆర్జీవీ ప్రెస్మీట్ పెట్టి నిశితంగా వివరించారు.
ఎవరో కోన్కిస్కా గాళ్లు..!
సినిమా రిలీజ్ అయిన అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. "ఎవరో కోన్కిస్కా గాళ్లు చెబితే కోర్టులు సినిమా ఆపేస్తాయా?. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నేను తీవ్ర అసంతృప్తితో ఉన్నాను. సినిమా విడుదలైన అన్నిచోట్ల మంచి టాక్ వస్తోంది. థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయ్. సినిమా జీవితంలో ఏం జరిగిందన్న ఆసక్తితోనే సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు" అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్కు మరోసారి వెన్నుపోటు!
"ఈ సినిమాను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అడ్డుకుని ఏం సాధిస్తారు. నిజాన్ని ఎప్పటికీ దాచలేరు. సినిమా ఆపడమంటే ఎన్టీఆర్కు మరోసారి వెన్నుపోటు పొడిచినట్లే. ఆనాడు ఎన్టీఆర్ను గద్దె దించాక సింహ గర్జన సభ పెట్టుకునేందుకు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. మానసిక క్షోభతో ఆయన చనిపోయేలా వెన్నుపోటు పొడిచారు.
ఇప్పుడు ఆయన సినిమాను అడ్డుకుని మరోసారి వెన్నుపోటు పొడిచారు. దీనికి వెనుక ఎవరున్నారన్నది నేను చెప్పనక్కర్లేదు. అందరికీ తెలుసు. ఆనాడు ఎన్టీఆర్కు కుటుంబసభ్యులెవరూ అండగా నిలవలేదు. కానీ ఇప్పుడు చట్టం ద్వారా ఎన్టీఆర్ను గెలిపించుకుంటాం.
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం. అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చాక సినిమా ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఓ రాష్ట్రంలో సినిమా విడుదలై, మరో రాష్ట్రంలో ఆపడం అన్నది ఇప్పటివరకూ ఎక్కడా జరగలేదు" అని ఆర్జీవీ ఒకింత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout