అదంతా అబద్ధమంటున్న వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు ఫోకస్ అంతా `లక్ష్మీస్ ఎన్టీఆర్`పైనే ఉంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కి సంబంధించి మూడు బయోపిక్స్ రూపొందుతున్నాయి. వాటిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒకటి. ఇందులో మోడల్ రూపాలి లక్ష్మీ పార్వతిగా నటిస్తుందని వార్తలు వినిపించాయి. అందుకు కారణం ఆమె తిరుపతిలో జరిగిన ఈ సినిమా ప్రారంభ వేడుకల్లో కనపడటమే. అయితే ఈ వార్తలను వర్మ ట్విట్టర్ ద్వారా ఖండించారు.
``సినిమా నిర్మాతల్లో ఒకరి భార్యకి రూపాలి స్నేహితురాలు కావడం వల్లనే రూపాలి `లక్ష్మీస్ ఎన్టీఆర్` ప్రారంభ వేడుకలకు వచ్చారని అంతే తప్ప సినిమాకు ఆమెకు ఎటువంటి సంబంధం లేద``ని చెప్పేశాడు వర్మ. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల వివాహం తర్వాత ఎన్టీఆర్ వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో జరిగిన మార్పులను ఆధారంగా చేసుకునే `లక్ష్మీస్ ఎన్టీఆర్`ను తెరకెక్కిస్తున్నాడు వర్మ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout