అదంతా అబద్ధమంటున్న వర్మ
- IndiaGlitz, [Monday,November 05 2018]
వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఇప్పుడు ఫోకస్ అంతా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పైనే ఉంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి సంబంధించి మూడు బయోపిక్స్ రూపొందుతున్నాయి. వాటిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒకటి. ఇందులో మోడల్ రూపాలి లక్ష్మీ పార్వతిగా నటిస్తుందని వార్తలు వినిపించాయి. అందుకు కారణం ఆమె తిరుపతిలో జరిగిన ఈ సినిమా ప్రారంభ వేడుకల్లో కనపడటమే. అయితే ఈ వార్తలను వర్మ ట్విట్టర్ ద్వారా ఖండించారు.
''సినిమా నిర్మాతల్లో ఒకరి భార్యకి రూపాలి స్నేహితురాలు కావడం వల్లనే రూపాలి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రారంభ వేడుకలకు వచ్చారని అంతే తప్ప సినిమాకు ఆమెకు ఎటువంటి సంబంధం లేద''ని చెప్పేశాడు వర్మ. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల వివాహం తర్వాత ఎన్టీఆర్ వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో జరిగిన మార్పులను ఆధారంగా చేసుకునే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను తెరకెక్కిస్తున్నాడు వర్మ.