రజనీకాంత్ పై వర్మ సెటైర్...
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో రకంగా వార్తల్లో ఉంటూనే ఉంటాడు. తాజాగా వర్మ చెన్నై లో కురుస్తున్న వర్షాలు..కోట్లుండి లక్షల్లో సహాయం చేస్తున్నతారలు పై ట్విట్టర్ లో కామెంట్ చేసాడు. కోట్లు ఉన్న సూపర్ స్టార్ లు లక్షల్లో సహాయం చేయడం ఏమిటో..బిక్షం వేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నాడు.
అలాగే వర్షాలు కురిపించేది దేవుడే. ఆ దేవుడే చెన్నైలో వర్షాలు కురిపించాడంటే చెన్నై వాసులు పాపులు అందుకే దేవుడే శిక్షించాడనుకోవాలా అని అడుగుతున్నాడు. దేవుడి చేసిన ఈ పనికి చాలా కోపంగా ఉన్నాను. ఇది దేవుడు చేసిన ఉగ్రవాద చర్యగా భావిస్తున్నాను అన్నాడు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి వర్మ స్పందిస్తూ..ఈ వర్షాలు ఆపడానికి రజనీకాంత్ ఎందుకు.. ఏమీ చేయడం లేదో తెలియక ఆశ్చర్యపోతున్నాను అంటూ సెటైర వేసేసాడు. మరి..వర్మ సెటైర్ పై చెన్నై వాసులు, రజనీ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com