‘మర్డర్’పై నమోదైన కేసుపై స్పందించిన వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ‘మర్డర్’పై మిర్యాలగూడ పోలీస్ స్టేషన్‌లో నిన్న కేసు నమోదైంది. వర్మ మిరియాలగూడకు చెందిన ప్రణయ్ హత్యపై సినిమాను తెరకెక్కించనున్నవిషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తన కుమారుడి హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ ప్రణయ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం కానీ.. ఎవరినీ దిగజార్చే ఉద్దేశం కానీ లేదని ముందే చెప్పానని పేర్కొన్నారు. ఓ సున్నితమైన అంశంతో తాను సినిమాను తీయనున్నానని వెల్లడించారు.
అయితే చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను కూడా చట్ట ప్రకారంగా మాత్రమే ముందుకు వెళతానన్నారు. ఊహాగానాల ఆధారంగా మాత్రమే తనపై కేసు నమోదైందని.. దానికి తన న్యాయవాదులు సమాధానం ఇస్తారన్నారు. తన చిత్రంపై ‘మర్డర్’పై దాఖలైన కేసు మీడియా ఊహాగానాలకు సంబంధించిందని.. కానీ తాను నిజ జీవిత ఘటనల నుంచి ప్రేరణ పొంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని.. స్టోరీ మాత్రం కల్పితమని వర్మ వెల్లడించారు. అలాగే ఈ చిత్రంలో ఎవరి కులం గురించి తాను ప్రస్తావించలేదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout