ఈ బాస్టడ్‌ను ఏం చేస్తారో చెప్పండి! : ఆర్జీవీ
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ వ్యక్తి జింకలను కాల్చుతూ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి లింక్ పెడుతూ ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ ట్వీట్ పూర్తి సారాంశమేంటి..? ఆ ట్వీట్‌పై నెటిజన్లు ఏమంటున్నారు..? ఆర్జీవీ రిప్లై ఎలా ఇచ్చారు..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సల్మాన్ సంగతేంటి!?
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన.. కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. విచారణ నిమిత్తం జోధ్‌పూర్ కోర్టుకు వెళ్తూ వస్తున్నారు. కాగా.. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ కోసం జోధ్‌పూర్ వెళ్లిన సల్మాన్.. అక్కడ సహ నటులు సైఫ్ అలీఖాన్, సోనాలీబెంద్రే, టబు, నీలం కొఠారీ, దుష్యంత్ సింగ్ తదితరులతో కలిసి అడవుల్లోకి వెళ్లి రెండు కృష్ణ జింకలను వేటాడినట్టు ఆరోపణలున్నాయి. కాగా.. ఈ కేసును విచారించిన కోర్టు సల్మాన్‌ను దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సల్మాన్ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.
ఇంతకీ ఆయనెవరో!?
ఆర్జీవీ పోస్ట్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి జింకలను కాల్చుతూ షూటింగ్ ప్రాక్టింగ్ చేస్తున్నట్లున్నాడు. అంతేకాదు.. షూటింగ్లో గాయపడిన జింకను కత్తితో కోస్తున్నట్లు కూడా వీడియోలో ఉండటం గమనార్హం. గత కొన్ని రోజులుగా ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే ఆ వ్యక్తి ఎవరో..? ఈ ఘటన ఎక్కడ జరిగింది..? ఇంతకీ మనదేశంలోనేనా.. మరో దేశంలో ఎక్కడైనా జరిగిందా..? అనే విషయం మాత్రం తెలియరాలేదు. కొందరైతే ఓ కేంద్రమంత్రి అంటూ పేరును ప్రస్తావిస్తుండగా.. మరికొందరు మాత్రం అబ్బే అది మనదేశంలో జరగలేదు.. బంగ్లాదేశ్‌లో అని చెబుతున్నారు.
ఆర్జీవీ డిమాండ్ ఇదీ..!
జింకల వేట కేసులో.. సల్మాన్ ఖాన్‌ను పోలీసులు, కోర్టులు వెంటాడుతున్నాయ్ సరే.. మరి ఇదిగో ఈ వీడియోలో చూస్తున్న బాస్టడ్‌ను ఎందుకు పట్టుకోవట్లేదు..? ఏం చేస్తున్నారురు..? ఆయన యార్డ్ ముందు ఇలా షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడే.. మరి పోలీసులు, కోర్టులు ఏం చేస్తున్నాయ్..? పోలీసులు, కోర్టులు ఏం చేస్తాయో చెప్పండి..? అని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ డిమాండ్ చేస్తున్నారు.
If Salman khan is being hunted by police and courts for hunting a deer in a forest,shouldn’t the same police and courts hunt this terrible bastard who’s practicing hunting in his own front yard ??? If at all there is justice I demand the police and courts to answer this pic.twitter.com/7taCgLx0gb
— Ram Gopal Varma (@RGVzoomin) January 28, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments