ఇంతకీ ఆ శక్తులెవరు.. ఆర్జీవీ ఆగ్రహం!
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి ఎంత క్రేజ్ వచ్చిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నది. ఏపీలో మాత్రం రిలీజ్కు నోచుకోవడంలేదు. దీంతో మే 01న ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పోస్టర్లు కూడా విడుదల చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు.
ఆర్జీవీ ఆగ్రహం..!
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా కన్నెర్రజేశారు. "శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనే సాకుతో అధికారులు ఆంధ్రప్రదేశ్లో అన్ని థియేటర్ల నుంచి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తగిలేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తరవాత, హైకోర్టు అనుమతి ఇచ్చాక కూడా శాంతి భద్రతల సమస్య ఇంకా ఎక్కడ ఉంది. ఈ చర్యల వెనుకున్న శక్తులు ఎవరు..? ఆ శక్తులను నేను ప్రశ్నిస్తున్నాను’ అని వర్మ ట్వీట్ చేశారు. అంతకముందు పాయింట్ 8సీతో తాము కోర్టును ఆశ్రయిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments