ఇంతకీ ఆ శక్తులెవరు.. ఆర్జీవీ ఆగ్రహం!

  • IndiaGlitz, [Wednesday,May 01 2019]

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి ఎంత క్రేజ్ వచ్చిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నది. ఏపీలో మాత్రం రిలీజ్‌కు నోచుకోవడంలేదు. దీంతో మే 01న ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పోస్టర్లు కూడా విడుదల చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు.

ఆర్జీవీ ఆగ్రహం..!

దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా కన్నెర్రజేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనే సాకుతో అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని థియేటర్ల నుంచి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తగిలేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తరవాత, హైకోర్టు అనుమతి ఇచ్చాక కూడా శాంతి భద్రతల సమస్య ఇంకా ఎక్కడ ఉంది. ఈ చర్యల వెనుకున్న శక్తులు ఎవరు..? ఆ శక్తులను నేను ప్రశ్నిస్తున్నాను’ అని వర్మ ట్వీట్ చేశారు. అంతకముందు పాయింట్ 8సీతో తాము కోర్టును ఆశ్రయిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

 

More News

ప్రధాని మోదీ వదిన కన్నుమూత

ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రధాని మోదీ చిన్న అన్నయ్య.. ప్రహ్లాద్ మోదీ భార్య భగవతి (55) (మోదీ వదిన) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

'ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ బాబాయ్ ఇతనే..!

టాలీవుడ్ టాప్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. వడ్డీలో ‘కోత’

ప్రభుత్వం బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. మే-01 నుంచి కొత్త వడ్డీ రేట్ల విధానం అమల్లోకి తెచ్చింది.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' వ్యవహారం: ఆర్జీవీకి చంద్రబాబు పంచ్!

టాలీవుడ్ సంచలన దర్శకుడు తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం మే-01న ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ కావాల్సి ఉంది.

మావోల రివెంజ్..15 మంది కమాండోలు మృతి

మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం మధ్యాహ్నం మూడు డజన్ల వాహనాల్ని తగలబెట్టారు.