‘పవర్‌స్టార్’ వేదికగా.. మరో సంచలనానికి తెరదీసిన వర్మ
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరదీశారు. ఇప్పటి వరకూ ప్రపంచ సినీ చరిత్రలో లేని సరికొత్త విధానానికి వర్మ శ్రీకారం చుట్టబోతున్నారు. ‘పవర్ స్టార్’ పేరుతో వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇది పవన్ స్టోరీ కాదంటూనే ఆయనకు సంబంధించిన అంశాలతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ విడుదల చేస్తూ వర్మ ఈ సినిమాపై బాగా క్రేజ్‌ను పెంచేశారు. ప్రస్తుతం ఆయన ‘పవర్ స్టార్’ ట్రైలర్‌ను వదిలో పనిలో ఉన్నారు. అయితే ఇది ఫ్రీగా చూడటానికి లేదు. రూ.25 కడితేనే ట్రైలర్ చూడొచ్చు. ట్రైలర్‌కు డబ్బులా? వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. వర్మ స్వయంగా వెల్లడించిన నిజం.
అసలు వర్మ ఏం చెప్పారంటే...
‘‘నా ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో జులై 25 ఉదయం 11 గంటలకు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న ‘పవర్ స్టార్’ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. తను స్థాపించిన ’మనసేన’ పార్టీ.. ఎన్నికల్లో భయంకరమైన ఫ్లాఫ్ అవడంతో చాలా బలహీన పడిపోయిన ఒక పవర్ఫుల్ స్టార్ యొక్క అంతర్మథనంతో మొదలై.. ఈ సినిమా స్టార్ వెల్ విషర్లతో పాటు తన వెన్నుపోటు దారుల గురించి కూడా ప్రస్తావిస్తూ.. ఇంకా తన వెనుక ఉన్న రష్యా భార్య.. ఫాం హౌస్‌లోని తన మొక్కలపైనా.. గేదెలపైనా స్టార్‌కున్న అత్యంత మక్కువతో కూడా బాగా బాగా నిండిపోయి ఉంటుంది.
‘పవర్‌స్టార్’ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్య విషయం ఏంటంటే.. ఇంత వరకూ ప్రపంచ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా పవర్ స్టార్ ట్రైలర్ చూడటానికి మనిషికి రూ.25 చొప్పున వసూలు చేయబోతున్నాం. ఈ సంచలనానికి ఫుల్ క్రెడిట్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ తీసుకుంటోంది. ట్రైలర్ చూసేందుకు బుకింగ్స్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో ఆల్రెడీ మొదలైపోయాయి. www.rgvworldtheator.com లోకి వెళ్లి లాగిన్ అయితే దానిలో ఈ ట్రైలర్‌కు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. ఇక ‘పవర్ స్టార్’ సినిమా చూసేందుకు రూ.150 + జీఎస్టీతో ఈ సినిమా టికెట్లు అమ్మబడతాయి. కానీ ఈ ఆఫర్ కేవలం జులై 25 ఉదయం 11 గంటల వరకే. ఈలోపు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకపోతే మనం మామూలుగా టికెట్ దొరక్కపోతే ఎలా బ్లాక్‌లో పెట్టి కొంటామో అలాగే ‘పవర్ స్టార్’ సినిమా టికెట్టు రూ.250 పెట్టి కొనాల్సి ఉంటుంది. ట్రైలర్ చూడటానికి అడ్వాన్స్ బుకింగ్ ఆల్రెడీ ఓపెన్’’ అని ఆర్జీవీ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments