నేను ఎవరినీ ఫోర్స్ చేయలేదు - వర్మ
- IndiaGlitz, [Sunday,October 21 2018]
మీ టూ ఉద్యమం చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి కదా! మీ పేరు బయటకు వస్తుందని బయపడుతున్నారా? అని వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మను ప్రశ్నిస్తే..'నేను ఏ ఆర్టిస్టుని దేనీకి ఫోర్స్ చేయను.
అందుకనే నా పేరు ఎక్కడా బయటకు రాలేదు. నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను అనుకునే మగవాళ్లు స్త్రీలను తక్కువగా చూస్తారు. వేధిస్తారు. అదే మీ టూ ఉద్యమానికి దారి తీసింది. ఎవరైనా తప్పు చేస్తే ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది మీ టూ ఉద్యమం వల్ల స్త్రీలకు అవగాహన కలుగుతుంది.
ఇది మంచి ఉద్యమమే. మగవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు. అయితే శశ్మాన వైరాగ్యంలా కొన్నిరోజులకు అందరూ దీన్ని మరచిపోయే అవకాశం ఉంది' అంటూ సమాధానమిచ్చారు రామ్గోపాల్ వర్మ.