వర్మతో నాగ్...
Send us your feedback to audioarticles@vaarta.com
శివ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు రాంగోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున. 26 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని మార్చేసింది. నాగార్జునను స్టార్‌ను చేసేసింది. ఆ తర్వాత నాగార్జున, వర్మ కలిసి అంతం, గోవిందా గోవింద సినిమాలు చేసిన అవి అనుకున్నంత సక్సెస్‌లు కాలేకపోయాయి.
దాదాపు పాతికేళ్ల తర్వాత నాగ్, వర్మ కలిసి సినిమా చేయబోతున్నారట. ఈ విషయాన్ని వర్మ తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. రియలిస్టిక్ డ్రామాగా సినిమా ఉంటుందట. . శివ స్టయిల్లో కాకుండా, తను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు డిఫరెంట్‌గా ఈ సినిమా ఉంటుందని తెలిపారు వర్మ. రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని వర్మ తెలిపారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments