పరువు హత్యతో వర్మ సినిమా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్య తెలుగురాష్ట్రాల్లో అమితంగా పాపులర్ అయిన పదం పరువు హత్య. పరువు కోసం అల్లుడును చంపించిన మారుతిరావు వల్ల ఈ పదబంధం చాలా ఫేమస్ అయింది. ఎప్పుడూ కాంటెంపరరీ విషయాలతో సినిమాలు తీయడానికి ముందుండే వర్మ తాజాగా కూడా పరువు హత్యకు స్పందించారు. ఆయన నిర్మిస్తున్న `భైరవ` కంప్లీట్‌గా అలాంటి సినిమానే అట. ఆయన అసిస్టెంట్ సిద్ధార్థ ఈ సినిమాకు దర్శకుడు. అభిషేక్ నామా తెలుగులో విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 25న విడుదల కానుందీ సినిమా.
ఈ సినిమా కంప్లీట్‌గా ఓ లవ్‌స్టోరీకి సంబంధించి ఉంటుందట. అది కూడా నిజజీవిత కథ అని సమాచారం. ఇందులో వర్గాలు, కులాల ప్రస్తావన కూడా ఉంటుందట. ఇంటెన్స్ ఎమోషన్స్, రస్టిక్ డ్రామాతో సాగుతుందని తెలిసింది. ధనంజయ్ హీరోగా నటించారు. ఐరా ఇందులో గీతగా నటించింది. భైరవగీత అనే పేరును హీరో, హీరోయిన్ల కేరక్టర్ల పేర్లతో పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తుంది. పరువు హత్యల మీద హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్న ఈ సమయంలో వర్మ సినిమా విడుదల కావడం ఆయనకు కలిసి వస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తెలుగు, కన్నడలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com