ప‌రువు హ‌త్యతో వ‌ర్మ సినిమా?

  • IndiaGlitz, [Tuesday,September 25 2018]

ఈ మ‌ధ్య తెలుగురాష్ట్రాల్లో అమితంగా పాపుల‌ర్ అయిన ప‌దం ప‌రువు హ‌త్య‌. ప‌రువు కోసం అల్లుడును చంపించిన మారుతిరావు వ‌ల్ల ఈ ప‌దబంధం చాలా ఫేమ‌స్ అయింది. ఎప్పుడూ కాంటెంప‌ర‌రీ విష‌యాల‌తో సినిమాలు తీయ‌డానికి ముందుండే వ‌ర్మ తాజాగా కూడా ప‌రువు హ‌త్య‌కు స్పందించారు. ఆయ‌న నిర్మిస్తున్న 'భైర‌వ‌' కంప్లీట్‌గా అలాంటి సినిమానే అట‌. ఆయ‌న అసిస్టెంట్ సిద్ధార్థ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. అభిషేక్ నామా తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. అక్టోబ‌ర్ 25న విడుద‌ల కానుందీ సినిమా.

ఈ సినిమా కంప్లీట్‌గా ఓ ల‌వ్‌స్టోరీకి సంబంధించి ఉంటుంద‌ట‌. అది కూడా నిజ‌జీవిత క‌థ అని స‌మాచారం. ఇందులో వ‌ర్గాలు, కులాల ప్ర‌స్తావ‌న కూడా ఉంటుంద‌ట‌. ఇంటెన్స్ ఎమోష‌న్స్, ర‌స్టిక్ డ్రామాతో సాగుతుంద‌ని తెలిసింది. ధ‌నంజ‌య్ హీరోగా న‌టించారు. ఐరా ఇందులో గీత‌గా న‌టించింది. భైర‌వ‌గీత అనే పేరును హీరో, హీరోయిన్ల కేర‌క్ట‌ర్ల పేర్ల‌తో పెట్టారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. ప‌రువు హ‌త్య‌ల మీద హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్న ఈ స‌మయంలో వ‌ర్మ సినిమా విడుద‌ల కావ‌డం ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. తెలుగు, క‌న్న‌డ‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

More News

స్టార్ త‌న‌యుడి పెద్ద‌మ‌న‌సు

సినిమా ప్ర‌యాణంలో అప్పుడ‌ప్పుడు కొన్ని మేలు మ‌జిలీలుంటాయి. తెలుగు సినిమా చ‌రిత్ర‌ను రాయాల్సి వ‌స్తే అర్జున్ రెడ్డిని తాక‌కుండా ముందుకు పోవ‌డం అసాధ్యం.

వెంకీ... సూప‌ర్ బిజీ!

హీరో వెంక‌టేష్ ఇప్పుడు సూప‌ర్ బిజీగా మారారు. తండ్రి రామానాయుడు చ‌నిపోయిన త‌ర్వాత దాదాపు ఏడాదిన్న‌ర‌కు పైగా గ్యాప్ తీసుకున్న ఆయ‌న తాజాగా

'ప‌డిప‌డిలేచే మ‌న‌సు' పూర్తి కావ‌చ్చింది

ప‌డి ప‌డి లేచే  మ‌న‌సు అన‌గానే శ‌ర్వానంద్ సినిమా గుర్తుకొస్తుంది. అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ సినిమాల ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం

చ‌ర‌ణ్ జోడీ వ‌చ్చేసింది!

చ‌ర‌ణ్ జోడీ కొత్త‌గా రావ‌డ‌మేంటి? అని అనుకుంటున్నారా..? వ‌చ్చింది కొత్త‌గానే. కాక‌పోతే పాత సినిమాలోకే. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో

దేవ‌దాస్  సెన్సార్ పూర్తి, సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల

నాగార్జున‌, నాని హీరోలుగా న‌టించిన సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. 'U/A' స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది.