హైకోర్టుకు బాలీవుడ్... వర్మ ఎద్దేవా!!
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కొన్ని మీడియా సంస్థలపై హైకోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకెళ్తే.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్లో నటీనటులు డ్రగ్స్ వాడుతున్నారంటూ రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. దీంతో రిపబ్లిక్, టైమ్స్ నౌ సంస్థలు తమ వ్యక్తిగత గోప్యతకు ఇబ్బందిని కలిగించారంటూ 34 ప్రముఖ బాలీవుడ్ సంస్థలు. నిర్మాతలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా ఈ సంస్థలు వార్తలను ప్రసారం చేశాయంటూ పిటిషన్లో బాలీవుడ్ నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, రిపోర్టర్ ప్రదీప్ భండారి, టైమ్స్ నౌ చీఫ్ ఇన్ ఎడిటర్ రాహుల్ శివశంకర్, గ్రూప్ ఎడిటర్ నవికా కుమార్ పేర్లను పిటిషన్లో పేర్కొన్నారు. సదరు మీడియా సంస్థలను నివారించాలంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు కోర్టును కోరాయి.
అయితే ఈ వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బాలీవుడ్ తీరుని తప్పు పట్టారు. ఎప్పుడో విమర్శలు చేస్తే ఇప్పుడు కోర్టుకు వెళ్లడమేంటి?. క్లాస్‌లో టీచర్‌కు పిల్లలు కంప్లైంట్ చేసినట్లు ఫిర్యాదులేంటి? అనేలా వర్మ కామెంట్ చేస్తూ పోస్టు పెట్టాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout