హైకోర్టుకు బాలీవుడ్... వ‌ర్మ ఎద్దేవా!!

బాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ కొన్ని మీడియా సంస్థ‌ల‌పై హైకోర్టును ఆశ్ర‌యించింది. వివ‌రాల్లోకెళ్తే.. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత ప‌లు ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్ర‌మంలో బాలీవుడ్‌లో న‌టీన‌టులు డ్ర‌గ్స్ వాడుతున్నారంటూ రిప‌బ్లిక్ టీవీ, టైమ్స్ నౌ సంస్థ‌లు వార్త‌లు ప్ర‌సారం చేశాయి. దీంతో రిప‌బ్లిక్‌, టైమ్స్ నౌ సంస్థ‌లు త‌మ వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు ఇబ్బందిని క‌లిగించారంటూ 34 ప్ర‌ముఖ బాలీవుడ్ సంస్థ‌లు. నిర్మాత‌లు ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు.

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వ్య‌తిరేకంగా ఈ సంస్థ‌లు వార్త‌ల‌ను ప్ర‌సారం చేశాయంటూ పిటిష‌న్‌లో బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు పేర్కొన్నాయి. రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, రిపోర్ట‌ర్ ప్ర‌దీప్ భండారి, టైమ్స్ నౌ చీఫ్ ఇన్ ఎడిట‌ర్ రాహుల్ శివ‌శంక‌ర్‌, గ్రూప్ ఎడిట‌ర్ న‌వికా కుమార్ పేర్ల‌ను పిటిష‌న్‌లో పేర్కొన్నారు. స‌ద‌రు మీడియా సంస్థ‌ల‌ను నివారించాలంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లు కోర్టును కోరాయి.

అయితే ఈ వ్య‌వ‌హారంపై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ బాలీవుడ్ తీరుని త‌ప్పు ప‌ట్టారు. ఎప్పుడో విమ‌ర్శ‌లు చేస్తే ఇప్పుడు కోర్టుకు వెళ్ల‌డ‌మేంటి?. క్లాస్‌లో టీచ‌ర్‌కు పిల్ల‌లు కంప్లైంట్ చేసిన‌ట్లు ఫిర్యాదులేంటి? అనేలా వ‌ర్మ కామెంట్ చేస్తూ పోస్టు పెట్టాడు.

More News

అన్న‌పై కౌంట‌ర్... త‌మ్ముడు రీకౌంట‌ర్‌

క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్‌గా రాజ‌కీయాలు, ఓటర్లు గురించి మాట్లాడుతూ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

నిలిచిపోయిన మరో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్..

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అభివృద్ధి చేస్తున్న మరో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి.

ప్రేరణను పరిచయం చేసిన ప్రభాస్..

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌, రాధాకృష్ణకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’‌. పీరియాడిక్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా

మనం మాట్లాడుకోపోతేనే బెటర్ : మోనాల్‌కు తెగేసి చెప్పిన అభి

ఇవాళ నామినేషన్స్.. గత వారం స్థాయిలో రచ్చ అయితే జరగలేదు. గత వారంతో పోలిస్తే ఈవారం ప్రశాంతంగానే జరిగినట్టు అనిపించింది.

మరో 72 గంటల పాటు అతి భారీ వర్షాలు..

హైదరాబాద్‌కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. మరో 72 గంటలపాటు అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వెల్లడించింది.