వర్మ ప్రేమలేఖ
- IndiaGlitz, [Wednesday,February 28 2018]
ఇటీవల నటి శ్రీదేవి హఠాన్మరణం చాలా మంది అభిమానులను బాధించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి అభిమానుల్లో రామ్‌గోపాల్ వర్మ ఒకరు. ఆయన తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ వచ్చారు. తన ఫేస్‌బుక్ ద్వారా మరోసారి శ్రీదేవి గురించి తెలియచేస్తూ దానికి రామ్‌గోపాల్ వర్మ ప్రేమలేఖ అని పేరు పెట్టారు. శ్రీదేవి జీవితం సినిమాలో కనిపించేంత అందమైనది కాదు.. ఎన్నోభయాలను ఆమె పొదివి పట్టుకున్నారు.
తండ్రి ఉన్నంతకాలం స్వేచ్ఛగా పక్షిలా ఎగిరిన ఆమె తర్వాత తల్లి చర్యలు వల్ల పంజరంలో పక్షిలా తయారయ్యారు. నేను శ్రీదేవిని చాలా దగ్గర నుండి చూసిన వారిలో ఒకరిని. అందమైన ముఖం, ఇద్దరు పిల్లలు, కుదురైన సంసారం అని బయట నుండి చూసేవారికి అనిపిస్తుంది. కానీ ఇంగ్లిష్ వింగ్లీష్ సినిమా సమయంలో తప్ప, మిగతా సమయంలో అసంతృప్తితో ఉన్న మహిళ శ్రీదేవి అని అన్నారు వర్మ. సున్నితమైన మనసున్న శ్రీదేవికి మనశ్శాంతి కరువైంది. చిన్నప్పట్నుంచే కెమెరా ముందు ఉండటం వల్ల ఆమెకు స్వేచ్ఛగా ఎదిగేంత స్పేస్ దొరకలేదు.
వయసు హీరోయిన్స్‌కు పెద్ద సమస్య అందులో శ్రీదేవికి మినహాయింపు లేదు. ఆమె కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులు, భర్త సూచనల మేరకే నడుచుకున్నారు. పిల్లల విషయంలో ఎక్కువ ఒత్తిడిగా ఉండేవారు. శ్రీదేవి మానసిక స్థితి గందరగోళంగా ఉండేదని వర్మ పెర్కొన్నారు.