వర్మ కిల్లింగ్ వీరప్పన్ న్యూ ట్రైలర్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కిల్లింగ్ వీరప్పన్. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా నటించగా.. ఢిల్లీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్రలో నటించారు. వీరప్పన్‌ను చంపిన ఓ పోలీస్ ఆఫీసర్ కథగా ఈ సినిమా రూపొందుతుంది.
వీరప్పన్ పాత్రధారి సందీప్ భరద్వాజ్ అచ్చు వీరప్పన్ లాగే ఉండడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పటికే ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ తాజాగా మరో ట్రైలర్ రెడీ చేస్తున్నారు. అయితే ఈ కొత్త ట్రైలర్ ను వీరప్పన్ ను పోలీసులు కాల్పులు జరిపి చంపిన అక్టోబర్ 18న రాత్రి 10:40కి కిల్లింగ్ వీరప్పన్ రెండో ట్ర్రైలర్ను విడుదల చేస్తుండడం విశేషం. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి నవంబర్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments