‘సాహో’కు ఆర్జీవీ ఫ్రీ ప్రమోషన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం రేపు అనగా ఆగస్టు-30న విడుదల కానుంది. ఇప్పటికే చేయాల్సిన అన్ని ప్రమోషన్స్‌ను చేసేసిన చిత్రబృందం.. తుది ఫలితం కోసం వేచి చూస్తోంది. ఈ సినిమాను మరో బాహుబలి రేంజ్ ఆడించాలని దర్శక నిర్మాతలు చేయని ప్రయత్నాలంటూ లేవు. ఇవన్నీ అటుంచితే ప్రభాస్ సినిమాకు టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, వివాదాలే తన ఊపిరి అంటున్న రామ్ గోపాల్ వర్మ.. పెద్ద ఎత్తున ఫ్రీ ప్రమోషన్స్ చేస్తున్నారు.
సేమ్ టూ సేమ్!
ఇందుకు కారణం కేవలం ఆర్జీవీ-ప్రభాస్ది ఇద్దరిదీ ఒకే కులం కావడం. ‘ప్రభాస్ ది నా కులమే.. అతని సినిమా సాహో కోసం నేను కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాను. ప్రభాస్ నా కులం వాడు కాబట్టి సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని వర్మ చెప్పుకొచ్చిన విషయం విదితమే.
ఒక్కసారి వీడియో చూడండి!
తాజాగా.. భీమవరంలో ఏర్పాటు చేసిన ప్రభాస్ సాహో ఫ్లెక్సిలతో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆయన..‘ భీమవరం రోడ్ల పక్కన ప్రభాస్ మీద రాజుల క్యాస్ట్ ఫీలింగ్ చూడండి’ అంటూ పోస్టు పెట్టాడు. అసలు క్యాస్ట్ ఫీలింగ్ సాకుతో ప్రభాస్ సాహో మూవీని వర్మ ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడో అన్నది ఆర్జీవీకే తెలియాలి. ఆర్జీవీ ఇంత రాద్ధాంతం చేస్తున్నా ప్రభాస్ మాత్రం ఇంతవరకూ ఏ ఇంటర్వ్యూలో గానీ... సోషల్ మీడియాలో గానీ ఈ వ్యవహారంపై స్పందించలేదు.. అసలు ఇలాంటి విషయాలను డార్లింగ్ లెక్కచేస్తారో లేదో మరి.
ఇదిలా ఉంటే.. భీమవరంలో ఎక్కడ చూసిన ‘సాహో’ బ్యానర్లే దర్శనమిస్తున్నాయి. భారీగా ఉన్న ప్రభాస్ ‘సాహో’ ఫ్లెక్సీలతో పట్టణాన్ని నింపేశారు. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే ఇప్పటివరకు ఏ నటుడికీ ఏర్పాటు చేయనంత భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు. దాదాపు 200 అడుగుల వెడెల్పుగల ఫ్లెక్సీని పెట్టడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Rajulu’s CASTE FEELING on PRABHAS RAJU on Bhimavaram Roads ?????????????? pic.twitter.com/2Uw269xgJU
— Ram Gopal Varma (@RGVzoomin) August 29, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com