సెన్సార్‌‌పై ఆర్జీవీ ఆగ్రహం.. KRKRకు సీక్వెల్ సినిమా

  • IndiaGlitz, [Friday,November 29 2019]

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. నవంబర్ 29న రిలీజ్‌ కావాల్సి ఉండగా.. తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పటి వరకూ చిత్రానికి సెన్సార్ ఇవ్వలేదు. దీంతో ఆర్జీవీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. సెన్సార్ అనేది ఔట్ డేటెడ్ ఇన్ స్టిట్యూషన్ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఈ సినిమాలో ఏ కులాన్నీ తక్కువ చేయలేదు. అంతా రూల్స్ ప్రకారం చేస్తే, ఏ సినిమా తీయలేం, విడుదలకాదు. సెటైర్ చేయడం కోసమే ఈ సినిమా తీశాను. ఏ పార్టీ కోసమో, వ్యక్తి కోసమో ఈ సినిమా తీయలేదు. అందుకే నేను ఈ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తున్నాను’ అని ఆర్జీవీ సంచలన ప్రకటన చేశారు.

కాగా.. ఇప్పటికే సినిమా టైటిల్ మారుస్తామని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు బదులుగా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని మారుస్తానని ఇప్పటికే ఆయన స్పష్టం చేశాడు. అయితే సినిమా డిసెంబర్-06న విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More News

వెంకటేశ్ సరసన మరో హీరోయిన్

‘ఎఫ్‌2’తో తిరుగులేని విజయాన్ని అందుకున్న హీరో వెంకటేశ్‌ దాని తర్వాత చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రాజీనామా చేసి వైసీపీలో చేరిన కారెం శివాజీ..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్షపార్టీలకు చెందిన సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, మాజీలు పార్టీలు మారుతున్న సంగతి తెలిసిందే.

ప్రియాంకరెడ్డి హత్యకేసు: నటీనటుల తీవ్ర ఆగ్రహం

దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు.

ప్రియాంకరెడ్డి హత్యకేసులో కీలక ఆధారాలు దొరికాయ్: సజ్జనార్

తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన ప్రియాంరెడ్డి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేవలం 24 గంటల్లోనే నిందితులెవరో తెలుసుకుని ఈ కేసు ఛేదించారు.

శానిటరీ వర్కర్‌ జాబ్ కోసం 7వేల మంది గ్రాడ్యుయేట్లు క్యూ...

ప్రస్తుత కాలంలో జాబ్ ఉంటే చాలు.. అది ఏం వర్క్ ఏం అనేది మాత్రం నిరుద్యోగులు చూడట్లేదు.