చంద్రబాబుకు తలనొప్పిగా మారిన ఆర్జీవీ!?

  • IndiaGlitz, [Monday,February 04 2019]

టైటిల్ చూడగానే అసలు రాంగోపాల్ వర్మకు.. సీఎం చంద్రబాబుకు ఏంటి సంబంధం..? ఆయనేమైనా రాజకీయ నేత ఏంటి తలనొప్పిగా మారడానికి అనే సందేహాలు మొదలవుతున్నాయ్ కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.. ఓ వైపు ఎన్నికల కోసం చంద్రబాబు వ్యూహాలు రచిస్తుంటే.. పానకంలో పుడకలాగా ఆయనకు ఆర్జీవీ మధ్యలో తలనొప్పిగా మారారు. అదేనండోయ్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రూపంలో.

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా పేరుగాంచిన రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్‌‌లుక్, రెండు సాంగ్స్‌, పాత్రదారులను అభిమానులు, సినీ ప్రియులకు పరిచయం చేసిన ఆర్జీవీ తాజాగా క్విజ్‌‌ ప్రోగ్రాం మొదలెట్టారు. ఇప్పటివరకూ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించి చంద్రబాబు పేరును పెద్దగా ప్రస్తావనకు తీసుకురాని వర్మ.. తాజాగా తన ట్వీట్‌లో మాత్రం ‘సీబీఎన్’ అంటూ బాబు పేరును తెరమీదికి తెస్తున్నారు.

వర్మ ట్వీట్స్ ఇవీ..!

వై కట్టప్పా కిల్డ్‌ బాహుబలి ఈజ్‌ ఫిక్షన్‌ (కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది కథ).. వై సీబీఎన్‌ (చంద్రబాబు నాయుడు) బ్యాక్‌స్టాబడ్‌ ఎన్టీఆర్‌ ఈజ్‌ రియల్‌ (ఎన్టీఆర్‌ను సీబీఎన్‌ ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అన్నది నిజం). ఆ నిజమేంటో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో తెలుసుకోండి అని వర్మ సంచలన ట్వీట్‌‌తో నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు.

ట్యాగ్ లైన్..!?

బాహుబలిని చంపిందెవరు..!? అనేది బాహుబలి రిలీజ్‌కు ముందు జనాల్లో ఆసక్తిని పెంచిన సంగతి తెలిసిందే. ఆ రేంజ్‌‌లో ఆర్జీవీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారేమో గానీ రోజుకో క్వశ్చన్, లుక్‌‌లతో రోజురోజుకూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా.. బహుబలిని చంపిందెవరు..? అనే ట్యాగ్‌‌లైన్‌ను పబ్లిసిటీ క్యాంపెయిన్‌‌కోసం వాడుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

ఎవరైనా చెప్పగలరా..!?

మరో ట్వీట్‌‌లో Who baCkstaBed NTR? అని ఆయన ట్వీట్ చేస్తూ మీరెవరైనా దీనికి సమాధానమిస్తారా..? అని సీబీఎన్ పేరు టక్కున గుర్తొచ్చేలా బోల్డ్ చేసి పెట్టారు వర్మ. ఇలా మొత్తం చంద్రబాబు మీదే ఆర్జీవీ దృష్టిసారించినట్లు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే సినిమా రిలీజ్‌‌కు మున్ముంథు ఇంకా ఎన్నెన్ని చిత్రవిచిత్రాలను ఆర్జీవీ పోస్ట్ చేస్తారో ఏంటో. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞా శెట్టి, చంద్రబాబు పాత్రలో శ్రీ తేజ్, ఎన్టీఆర్‌ పాత్రలో ఓ రంగస్థల నటుడ్ని ఆర్జీవీ పరిచయం చేయబోతున్నారు.

మొత్తానికి చూస్తే ఇప్పటికే సినిమా రిలీజ్ కాకుండా ఉండాలని వర్మపై ఎమ్మెల్యే వర్మను చంద్రబాబు దింపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రిలీజ్‌‌ను ఆపాలని ఇప్పటికే కోర్టుమెట్లెక్కినప్పకీ ఆర్జీవీ మాత్రం ‘నేనింతే.. ’ అంటూ రోజూ లీకులు చేస్తూ ఇలా నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ వ్యవహారమై చంద్రబాబు కాంపౌడ్‌‌లో ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది. అసలే ఎన్నికల సీజన్‌‌.. బిజీబిజీగా గడుపుతున్న టైమ్‌‌లో ఈ ఆర్జీవీ తలనొప్పిని ఏంటి.!? ఈ తలనొప్పిని ఎలా తప్పించాలో అర్థం కావట్లేదే? అంటూ తెలుగు తమ్ముళ్లు జుట్టుపట్టుకుంటున్నారట. అయితే ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుంది..? అసలు సినిమా రిలీజ్ అవుతుందా..? లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులపాటు వేచి చూడాల్సిందే మరి.

More News

రామ్ సినిమా చైత‌న్య చేస్తాడా?

గ‌రుడ‌వేగ వంటి స‌క్సెస్ త‌ర్వాత డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ హీరోగా సినిమా రూపొందుతుంద‌ని అన్నారు. క‌థా చర్చ‌లు అంతా పూర్త‌య్యాయి.

జనసేనలో చేరికపై మంత్రి గంటా క్లారిటీ

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేనలో చేరికను తాను ఒప్పుకోవట్లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం విశాఖ సభావేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. "మంత్రి గంటా శ్రీనివాసరావును...

మ‌ళ్లీ కెమెరా ముందుకు సోనాలి

తెలుగులో 'మురారి', 'ఇంద్ర‌', 'ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు' వంటి చిత్రాల్లో న‌టించిన బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే.. కొంత‌కాలంగా క్యాన్స‌ర్‌తో పోరాడుతున్నారు.

జయరామ్‌ కేసులో విస్తుపోయే నిజాలు చెప్పిన మేనకోడలు!

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ చౌదరి హత్యకేసులో విస్తుపోయే నిజానిజాలు వెలుగుచూశాయి. చౌదరి హత్య కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు...

చ‌ర‌ణ్ కొత్త ఇల్లు ఖ‌రీదెంతో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ ... టాలీవుడ్‌లోనే ఆస్థిప‌రుడైన హీరో అని ఓ నేష‌న‌ల్ ఛానెల్ రీసెంట్‌గా తెలియ‌జేసింద‌ట‌. చెర్రీ ఆస్థుల విలువ 1300 కోట్ల రూపాయ‌ల‌ను మించింద‌ని స‌ద‌రు ఛానెల్ తెలియ‌జేసింది.