రూమర్స్‌ను కొట్టి పారేసిన వర్మ...
Send us your feedback to audioarticles@vaarta.com
శివ, గోవిందా గోవింద, అంతం చిత్రాల తర్వాత అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `ఆఫీసర్`. కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాను వర్మ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ప్రస్తుతం సినిమా పోస్ట్ ఫ్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
హాలీవుడ్ మూవీ `టేకాన్` స్ఫూర్తిగా తీసుకుని వర్మ `ఆఫీసర్` సినిమాను తెరకెక్కించాడని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలకు వర్మ స్పందించాడు. హీరో పోలీస్ ఆఫీసర్ కావడం.. అతనికి ఓ కుమార్తె ఉండటం అనే అంశాలు మినహా `టేకాన్`కు `ఆఫీసర్`కి మధ్య పొంతన ఉండదని.. తన సినిమాపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేశాడు వర్మ. మరి రేపు సినిమా విడుదలైతే కానీ.. తెలియదు వర్మ చెప్పింది.. నిజమా అబద్ధమా అని...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com